గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని పల్లెప్రగతి రాష్ట్ర పరిశీలకులు, ఐజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారం, కొలంగూడ గ్రామాలను ఆయన సందర్శించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఉట్నూర్‌లో స్థానిక ప్రజలు, అధికారులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీకి సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు అధికారులు ప్రజలతో మమేకమై పనులు చేయాలని ఐజీ పేర్కొన్నారు. గ్రామంలో నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, ఎంపీడీవో తిరుమల బిక్షపతి గౌడ్, సర్పంచులు జనార్దన్, రాహుల్, ఎంపీపీ జయవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : రేవంత్ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్ రెడ్డి