ఆదిలాబాద్ జిల్లాలో లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి.. స్థానిక హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. పేద కుటుంబాలకు మానవతాదృక్పథంతో నిత్యావసరాలను పంపిణీ చేస్తోంది.
భీంపూర్, తాంసి మండలాలకు చెందిన పలు గిరిజన కుటుంబాలు, వితంతువులు, వికలాంగులకు.. సంస్థ సభ్యులు కూరగాయలు, మాస్కులు, శానిటైజర్, విటమిన్ సీ టాబ్లెట్లను అందజేశారు. మానవాతవాదులంతా ముందుకొచ్చి.. ఆపత్కాలంలో నిరు పేదలకు అండగా ఉండాలని వారు కోరారు.
ఇదీ చదవండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. పీపీఈ కిట్ల పేరుతో పీల్చిపిప్పి