ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. భీంపూర్ మండలంలో జోరుగా కురిసిన వర్షానికి.. పంట పొలాలన్ని నీట మునిగాయి.
అంతర్గావ్ సమీపంలోని రోడ్లు జలమయమై.. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతి తగ్గాక రాకపోకలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో.. ప్రజలంతా ఉపశమనం పొందారు.
ఇదీ చదవండి: RAINS: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం