ETV Bharat / state

వినాయక చవితికి.. మన బొజ్జ గణపయ్య ఏం వరమిచ్చాడో తెలుసా? - వినాయక చవితి సందర్భంగా కరోనాపై అవగాహన

వినాయక చవితి పండుగ రోజున ఎలాంటి హడావుడి, హంగామా లేకపోవడం చూసి భూలోకం వచ్చిన గణపయ్య ఆశ్చర్యపోయాడు. దేవలోకంలో తల్లిదండ్రులు శివపార్వతులు చెప్పిన కరోనా మహమ్మారి ప్రభావం ఇంతలా ఉంటుందనుకోలేదు బొజ్జగణపయ్య. మరి భూలోకానికి వచ్చిన గణనాథుడు ప్రజలందరికీ ఓ వరమిచ్చాడు. అదేంటో చూడండి!

ganesh-suggestions-to-people-to-keep-environment-clean
వినాయక చవితికి.. మన బొజ్జ గణపయ్య ఏం వరమిచ్చాడో తెలుసా?
author img

By

Published : Aug 22, 2020, 7:30 PM IST

దేవలోకంలో ఒకటే హడావుడి.. అందరిలో భయం.. ఆందోళన.. ఎలాగైనా వినాయకున్ని భూలోకం వెళ్లకుండా ఆపాలని చూస్తున్నారు. ఇవేమి పట్టించుకోని గణనాథుడు తన వాహనమైన ఎలుకను సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇంతలో ఆయన తల్లిదండ్రులు శివపార్వతులు వచ్చి.. 'ఆగు నాయనా.. వెళితే వెళ్లు కానీ ఈ మాస్క్‌ పెట్టుకుని వెళ్లు. ఎక్కడా దీన్ని తీయకు.. ఎవరితో కలవకు. ఎవరేమి పెట్టినా తినకు.. దూరం నుంచి చూసి రా' అంటూ జాగ్రత్తలు చెప్పారు.

'ఏంటీ ఎప్పుడూ లేనిది కొత్తగా ఏమేమో చెబుతున్నారు' అన్నాడు వినాయకుడు.. 'బాబు గణేశా.. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు భూలోకంలో కరోనా అనే మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోంది.. బయటకు రావడానికే జనం జంకుతున్నారు. ప్రజలు ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకో' అన్నారు శివపార్వతులు. అయినా అవేమి వినిపించుకోకుండా.. సరేలే అదేదో మేం చూస్తాం అంటూ.. తన వాహనమైన ఎలుకతో భూలోకానికి బయలుదేరాడు.

గణపయ్య: పండుగ వచ్చే నెల రోజుల ముందు నుంచే విగ్రహాల తయారీ, మండపాల ఏర్పాట్లలో ఉండే భక్తులు.. పండుగ రోజున కూడా బయట కనిపించకపోయేసరికి కంగారు పడుతూ ఏంటీ మూషికమా.. పండుగ సందడే లేదు. భక్తులు ఎక్కడe కనబడరే..?

మూషికం: ఏముంది..మహారాజా.. బహుశ అదేదో కరోనా వచ్చిందని చెప్పారు కదా! అందుకేనేమో.. జనాలు ఇళ్లల్లోనే ఉండిపోయారు.

గణపయ్య: అది సరే.. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర పాలజ్‌లో నవరాత్రి ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహించే వారు.. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దాం పద...

పాలజ్‌లో ఏంటీ భక్తుల ప్రత్యక్ష సందర్శనాన్ని రద్దు చేశామని అంటున్నారు.

మూషికం: అవును స్వామి ఇక్కడ కూడా కరోనా కారణంగా ప్రత్యక్ష దర్శనం లేదంటున్నారు.. కానీ ఎక్కడి నుంచైనా మిమ్మల్ని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.. వినాయక చవితి నుంచి 11 రోజుల పాటు ఆన్‌లైన్‌లో మీ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీని వల్ల ఉన్న చోటు నుంచే భక్తులు మీ ఆశీర్వాదం తీసుకుంటారు.

కొద్ది దూరం వెళ్లిన తర్వాత బారులు తీరిన జనాలను చూసిన వినాయకుడు.. వాళ్లు ఎవరు? ఎందుకలా గుమికూడి ఉన్నారు..?

మూషికం: వాళ్లు కరోనా పరీక్షలు చేసుకోవడానికి వచ్చారట..స్వామి

గణపయ్య: అది సరే.. ఇన్ని చెబుతున్నా.. రోజుకు ఇంత మంది పరీక్షలు చేసుకోవడానికి ఎందుకు వస్తున్నారు. జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇలా అయితే దీనికి వేరే మార్గం లేదా?

మూషికం: ఎందుకు లేదు. ఉంది స్వామి. మాస్క్‌ ధరించడం, ఇంటికి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, జనాల మధ్య తిరక్కుండా ఉండటం, వ్యక్తుల మధ్య దూరం పాటించడం తదితర జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాదని చెబుతున్నారు..

కరోనా రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మాస్క్‌లు ధరించేలా.. చేతులు శుభ్రంగా ఉంచుకునేలా చేయండి స్వామి..

గణపయ్య: సరే.. భక్తులు క్షేమంగా ఉండటమే కదా..! మనకూ కావాల్సింది.. ఇళ్లు, లేదా కాలనీల్లో ఆర్భాటానికి పోకుండా.. జాగ్రత్తలు తీసుకుంటూ.. కరోనా బారిన పడకూడదని దీవించి తిరిగి దేవలోకం బయలుదేరాడు వినాయకుడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.