ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామ సర్పంచ్ కల్యాణిపై గ్రామానికి చెందిన ఓ కుటుంబం దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఆమె తలకి గాయాలు కావడంతో కుటుంబీకులు హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత గొడవలు దాడికి కారణమని తెలిసింది. దాడి విషయాన్ని ఎస్సై రవీందర్ ధ్రువీకరించారు.
ఇదీ చదవండి: నేడు రాష్ట్రంలో కొవాగ్జిన్ టీకా రెండో డోసు నిలిపివేత