ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో జిల్లా అదనపు పాలనాధికారి డేవిడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న వర్షాకాలంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు.
పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో తిరిగి కరోనా పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని మురుగు కాల్వలు, చెత్తకుప్పలు లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో ప్రతీ ఒక్కరు విధిగా మాస్కులు ధరించేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాస్కులు ధరించని వారికి తక్షణమే జరిమానా విధించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లే ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలోనే పనులు చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ రాథోడ్ రాజేశ్వర్ తెలిపారు.
ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.