ఆదిలాబాద్‌లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొత్త కుమ్మరివాడలో ఇంటింటికి తిరిగి నీటితొట్టెలు, టైర్‌లలో నిలిచిన నీటిని పారబోయించారు.
నిల్వ నీటితో కలిగే అనర్థాల గురించి ప్రజలకు మలేరియా అధికారి శ్రీధర్ వివరించారు. రానున్న వానాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల లార్వాను అంతమొందించడానికి నిలిచి ఉన్న నీటిని పారబోయాలని తెలిపారు.
ఇవీ చూడండి: చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..