ETV Bharat / state

ఆరునెలల గర్భిణీని గర్భస్రావం చేసుకొమ్మని ఒప్పించిన వైద్యులు

ఓ గిరిజన మహిళకు వైద్యులు అబార్షన్​ చేశారు. గర్భిణీని ఒప్పించి మెప్పించి మరీ గర్భస్రావం చేశారు. జిల్లా ఉప వైద్యాధికారే స్వయంగా బాధితురాలు ఉంటున్న ఏజెన్సీ ప్రాంతానికి కష్టపడి వెళ్లి మరీ ఒప్పించారు. అదేంటి గర్భస్రావం చేయటం నేరం కదా... దానికి అధికారులే వెళ్లి ఒప్పించటమేంటని అనుకుంటున్నారా... అసలు కథేంటంటే...!

DOCTORS DONE ABORTION TO TRIBAL WOMEN IN ADILABAD DISTRICT

author img

By

Published : Feb 8, 2020, 6:33 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కామాయిపేటకు చెందిన మడావి రత్తుబాయి ఆరు నెలల గర్భిణీ. వైద్య పరీక్షల కోసం ప్రతీ నెలలాగే... ఆస్పత్రికి వెళ్లింది రత్తుబాయి. రక్త పరీక్షలతో పాటు వైద్యులు స్కానింగ్ నిర్వహించగా... బాధకలిగించే అంశం వెలుగు చూసింది. కడుపులో పిండం చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఎందుకైన మంచిదని ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించి మరోసారి స్కానింగ్​ నిర్వహించారు. అక్కడి వైద్యులు కూడా రత్తుబాయి కడుపులో పిండం చనిపోయిందని నిర్ధారించారు. వెంటనే గర్భస్రావం చేయాలని సూచించారు.

అర్థమయ్యేలా వివరించి...

గర్భస్రావానికి ఎంతమాత్రం ఒప్పుకోని రత్తుబాయి ఇంటికి వెళ్లిపోయింది. మూఢనమ్మకాలతో ప్రాణం మీదికి తెచ్చుకుంటుదేమోనని ఆందోళన చెందిన జిల్లా ఉప వైద్యాధికారి డా. మనోహర్ వెంటనే వైద్య సిబ్బందితో కలిసి రత్తుబాయి నివసిస్తున్న స్వగృహానికి చేరుకున్నారు. చనిపోయిన పిండం తీసేయకపోతే... తన ఆరోగ్యానికి ప్రమాదం వాటిళ్లుతుందని బాధితురాలికి అర్థమయ్యేలా వివరించారు. చివరకు సిబ్బంది అంతా... శ్రమించి రత్తుబాయిని ఒప్పించారు. అయితే బాధితురాలు మళ్లీ స్కానింగ్​ చేసి పిండం చనిపోయిందో లేదో మరోసారి నిర్ధారించాల్సిందిగా కోరుకుంది. అదే నిజమైతే గర్భస్రావం గురించి ఒప్పుకుంటామని చెప్పగా... అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రత్తుబాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఆరునెలల గర్భిణీని ఒప్పించి గర్భస్రావం చేసిన వైద్యులు

ఇదీ చూడండి: ఎఫ్​డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.