ETV Bharat / state

వ్యాపారుల ఏకపక్ష నిర్ణయం... పత్తిరైతుకు సంకటం... - ఆదిలాబాద్​ వ్యవసాయ మార్కెట్

ఆదిలాబాద్​ మార్కెట్​ యార్డులో మరోసారి వ్యాపారవర్గం ఏకపక్షంగా ధరలో కోత విధించింది. పత్తి ధరను రూ.50 రూపాయలు తగ్గించింది. ఇప్పటికే ఎనిమిది శాతం తేమతో క్వింటా​కు రూ. ఐదువేల ధర నిర్ణయించిన వ్యాపారవర్గం... ఈరోజు ఏకంగా రూ. 4950గా నిర్ణయించడం రైతుల పాలిటశాపంగా మారింది.

వ్యాపారుల ఏకపక్ష నిర్ణయం... పత్తిరైతుకు సంకటం
author img

By

Published : Nov 14, 2019, 4:26 PM IST

వ్యాపారుల ఏకపక్ష నిర్ణయం... పత్తిరైతుకు సంకటం

తెలంగాణలోనే ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్ యార్డుది ప్రత్యేకస్థానం. పత్తి క్రయ విక్రయాలకు ఇదో ప్రముఖ కేంద్రం. ఇక్కడ వ్యాపారవర్గం మరోసారి తమ బుద్ధి బయటపెట్టింది. ప్రభుత్వ మద్ధతు ధర రూ. 5550 ఉంటే... ఈ నెల ఆరో తేదీన కలెక్టర్‌ దివ్య దేవరాజన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాఠోడ్‌ బాపురావు సమక్షంలో ఎనిమిది శాతం తేమకు రూ.క్వింటా​కు రూ. 5వేలు చెల్లించడానికి వ్యాపార వర్గం అంగీకరించింది.

ఎనిమిది దాటితే.. కోతే...

మూడునాలుగు రోజులు అదేధరతో పత్తి కొనుగోలు సాగింది. ఆ తర్వాత పత్తి కొనుగోళ్లలో ధర తగ్గించడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. మంచు కురుస్తుండటం వల్ల సగటున క్వింటా​కు 14 నుంచి 16 శాతం తేమ వస్తోంది. ఈ లెక్కన ఎనిమిది శాతం తేమనే పరిగణలోకి తీసుకుంటున్న వ్యాపారులు... ఆపై వస్తున్న ఒక్కోశాతానికి రూ.49 చొప్పున కోత విధిస్తున్నారు.

14 కంటే ఎక్కువైతే... భారీ నష్టం

సగటున 14 శాతం తేమను పరిగణలోకి తీసుకుంటే... రూ.29 కోత పడుతుంటే.. క్వింటాకు రూ.4706 ధరే వస్తోంది. అదే తేమ 14 కంటే ఎక్కువ ఉంటే... పత్తి రైతులు మరింత నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్‌లో ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపకపోవడం వల్లే ప్రైవేటు వ్యాపారులు దగా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులంతా జట్టు కట్టడం రైతులు నిలువునా మోసపోవడానికి కారణమవుతోంది.

నోరు మెదపని అధికారులు

కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కంటే ముందు మంచి ధర వచ్చేలా చూస్తామని అధికారులు, పాలకులు భరోసా ఇచ్చారు. ఇప్పుడుమాత్రం మార్కెట్‌వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులే కాదు.. మార్కెట్‌ అధికారులు సైతం వ్యాపారులు ధరలో కోత విధించినట్లు అంగీకరించడం విశేషం.

ప్రైవేట్​ వ్యాపారులు, సీసీఐ అధికారుల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే ఆరోపణలున్నాయి. జరుగుతున్న తతంగం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.