విధుల్లో చేరిన తొలిరోజే అధికారులను హడలెత్తించారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన. వచ్చి రావడంతోనే తొలుత కలెక్టరేట్ పరిసరాలు కలియ తిరిగారు. అనంతరం అధికారులతో శాఖల వారీగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమీక్ష నిర్వహించారు. తనకు పూల బొకేలకు బదులు విద్యార్థులకు ఉపయోగపడేలా పెన్నులు, పరీక్ష ప్యాడ్లు అందించాలన్నారు.
సమీక్ష ఆరంభంలో అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను అవినీతిని సహించని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇస్తే ఒప్పుకోనని విడమరిచి చెప్పారు. తప్పు చేయని వారిని కాపాడేందుకు ఎంతటి వారినైనా ఎదిరిస్తానని భరోసానిచ్చారు. మొత్తానికి తొలిరోజు ఏకబిగిన సమీక్ష నిర్వహించి అధికారులకు చెమటలు పుట్టించారు.
ఇదీ చూడండి: '2024 నాటికి 5 బిలియన్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతే లక్ష్యం'