కరోనాపై గీతాన్ని ఆలపిస్తున్న ఆదివాసీ కళాకారులు
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి వివరిస్తూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆదివాసీ కళాకారులు చేసిన ప్రయత్నం ఆలోచింపజేస్తోంది. వైరస్ సోకకుండా ఆదివాసీలకు అర్థమయ్యేలా గోండి భాషలో రూపొందించిన పాట ఆకట్టుకుంటోంది. తొమ్మిది మంది కళాకారులు తమ స్వస్థలాల్లోనే ఉంటూ చరవాణిలో పాటపాడి రికార్డింగ్ చేశారు. ఆ పాటను యావత్మాల్‌లోని జిమ్మీ స్టూడియోకు పంపించి ఆడియో, వీడియో మిక్సింగ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు.
వాతా కరోనా అంటూ సాగే ఈ పాట వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తుంది. పాండురంగ్ మెస్రం రాసిన ఈ పాటను సుభోద్ వాల్కే, సోయం ఆనంద్, మెస్రం పాండురంగ్, ఆత్రం నందు, వెడ్మ వెంకటేష్, చాకటి రవి, మెస్రం మేఘరాజ్, వాలడి సురేష్, తొడసం నిలేష్‌లు ఆలపించారు. ఈ పాట తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ఆదివాసీల్లో వైరల్‌గా మారింది.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వృద్ధురాలికి ఎమ్మెల్యే సాయం