ETV Bharat / state

కరోనా భయం... ఆశా కార్యకర్తపై దాడికి యత్నం - ఆదిలాబాద్​లో ఆశా వర్కర్లపై దాడి

asha workers Protest latest news in adilabad

author img

By

Published : Apr 3, 2020, 1:03 PM IST

Updated : Apr 3, 2020, 3:18 PM IST

13:01 April 03

కరోనా భయం... ఆశా కార్యకర్తపై దాడికి యత్నం

ఆదిలాబాద్‌లో కరోనా బాధితుల కుటుంబీకుల సర్వే కోసం వెళ్లిన ఆశా కార్యకర్తపై దాడికి యత్నించిన ఘటన కలకం సృష్టిస్తోంది.  ఆదిలాబాద్‌ జిల్లా నుంచి 67 మంది దిల్లీలోని నిజాముద్దీన్‌  మతప్రార్థనలకు వెళ్లివచ్చినట్లుగా అధికారయంత్రాంగం నిర్ధరించింది. వీరి కుటుంబీకులకు సంబంధించిన వివరాలనుసేకరణను ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు అప్పగించింది.  

           సర్వేకు వెళ్లిన వాళ్లకు వివరాలు ఇవ్వకపోగా... ఓ బాధితుడి కుటుంబ సభ్యులు ఆశా కార్యకర్త వద్ద ఉన్న పేపర్లను చించివేశారు. ఒక్కసారిగా భయంతో ఆమె పరుగులు పెట్టింది. తమకు  భద్రత కల్పించాలంటూ ఆశా కార్యకర్తలు డీఎంహెచ్‌వో కార్యాలయంను ముట్టడించారు. వారి ఆందోళనను పట్టించుకోకుండానే డీఎంహెచ్‌వో చందు వెళ్లిపోయారు.   

Last Updated : Apr 3, 2020, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.