మొక్కజొన్న సాగుకు అవకాశమివ్వాలంటూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రామ రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. యాసంగిలో మక్క సాగు చేయొద్దని ప్రభుత్వం చెబుతుంటే ఆ పంట తప్ప వేరే పంటలు తమ భూముల్లో పండవనీ, ఖరీఫ్‌లో పత్తి, సోయా సాగు చేసి అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు వాపోయారు.
శనగ పంటకి తమ భూముల్లో దిగుబడి రాదని.. మొక్కజొన్న సాగుకు మాత్రమే తమ భూములు అనువైనవనీ, దానికి అవకాశం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: యశోద ఆసుపత్రిలోకి భారీగా చేరిన వరద నీరు