ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో టీఆర్టీ ఎస్జీటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో గందరగోళం ఏర్పడింది. కౌంటర్లు తక్కువగా ఏర్పాటు చేయటం వల్ల ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు బారులు తీరారు. వర్షం కారణంగా బయట నిలబడలేక ఇరుకైన వరండాలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. శనివారం ఏజెన్సీ అభ్యర్థుల పరిశీలన జరుగనుంది. ఈ నెల 29న జడ్పీ సమావేశ మందిరంలో అభ్యర్థుల కౌన్సిలింగ్ ఉంటుందని డీఈఓ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఖాకీల గుప్తనిధుల వేట.. అడ్డంగా దొరికిన ముఠా..