అదిలాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి కింద నిర్మిస్తున్న వైకుంఠధామాలు, చెత్త వేరుచేయు కేంద్రాలు, డంపింగ్‌యార్డుల పనులు గురించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆరా తీశారు. పాలనాప్రాంగణ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి పురపాలక, పంచాయతీరాజ్‌శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పురపాలికలో పారిశుద్ధ్య సిబ్బందికి గ్లౌజులు, శానిటైజర్లు, మాస్కులు అందజేయాలన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా అన్ని కూడళ్లలో పనులు చేపట్టాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని తెలిపారు.
రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లలో ఒకే రకమైన మొక్కలు నాటాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. సాత్నాల క్వార్టర్స్‌లోని ఖాళీస్థలంలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో రహదారులను ఊడ్చేందుకు యంత్రాలు కొనుగోలు చేయాలని సూచించిన ఎమ్మెల్యే, మరో డంపింగ్‌యార్డుకి స్థలం కేటాయించాలని పాలనాధికారిని కోరారు.
ఇవీ చూడండి: తెలంగాణ నుంచి ఆంధ్రాకు జలమార్గంలో మద్యం తరలింపు..