ఆదిలాబాద్ జిల్లా బోథ్ పంచాయతీలో స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలని గ్రామస్థులు, వ్యాపారులు తీర్మానించారు. వ్యాపారులతో సర్పంచ్ సురేందర్ యాదవ్, ఎంపీపీ తులా శ్రీనివాస్, పోలీసుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ప్రతిరోజు మార్కెట్లోని షాపులు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మంగళవారం సాగే వార సంత ఉండబోదని.. అలాగే ప్రతీ ఒక్కరు విధిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని అంతా సిద్ధమయ్యారు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. వాటి నియంత్రణకి బోథ్ గ్రామస్థులు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : తెలంగాణపై కొమ్ము విసురుతున్న కొవిడ్