పౌరసత్వ సవరణ బిల్లుకు మద్ధతుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎంపీ సోయం బాపురావు, జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జీ భూమారావు, మహిళా నేత సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని ఆయా వార్డుల నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.
డైట్ మైదానం నుంచి మొదలైన ఈ ర్యాలీ నేతాజీ చౌక్, వినాయక్ చౌక్ మీదుగా కొనసాగింది. జాతీయ జెండాలను చేతపట్టి దేశభక్తి నినాదాలతో ముందుకు సాగారు విద్యార్థులు. డైట్ మైదానంలో జరిగిన సభలో మున్సిపల్ ఎన్నికల్లో భాజాపాకు పట్టం కట్టి ప్రధాని మోదీ నిర్ణయం సరైనదేనని హిందువులు నిరూపించాలని సూచించారు ఎంపీ సోయం బాపురావు.
ఇవీ చూడండి: మున్సిపోల్లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్