ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేత్ర గణేశ్ మండలి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. అయ్యప్ప స్వామి మాలధారులు మెట్ల పూజ, అభిషేకం దగ్గరుండి చేయించారు. అనంతరం స్వామికి వివిధ రకాల పూలతో పుష్పార్చన చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు భజన పాటలతో పరిసరాల్ని హోరెత్తించారు.
ఇవీ చూడండి: యాదాద్రి ప్రాకారాలపై దేవతామూర్తుల విగ్రహాలు