శ్రీరామనవమితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా సినిమా ప్రస్తుతం వసూళ్ల ఒడిలో దూసుకెళ్లిపోతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఆ సినిమాలో అంగన్‌వాడీ కార్యకర్తలను అవమానపరిచేలా ఓ సీన్ ఉందని దానిని తీసేయాలని ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
దసరా సినిమాలో తమను అవమాన పర్చేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్థానిక థియేటర్ ఎదుట నిరసన చేపట్టారు. సినీ దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అంగన్‌వాడీ కార్యర్తలపై ఉన్న సన్నివేశాలు తొలగించకపోతే ఆందోళనలు మరింత ఉదృతం చేసి సినిమా ప్రదర్శనలు జరగకుండా అడ్డుకుంటామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ హెచ్చరించారు.
"ఈ మూవీలో హీరోయిన్ అంగన్వాడి టీచర్‌గా ఉన్నది. అయితే కొన్నిసన్నివేశాలు అంగన్వాడీలను అవమావపరిచే విధంగా ఉన్నాయి. కోడిగుడ్లను దొంగతనం చేసే దొంగలుగా అంగన్వాడీలను చిత్రీకరించారు. ఇది సమాజంలో అంగన్వాడీల ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ సినిమాలో ఉంది. తెలంగాణ అంగన్వాడీలను, హెల్పర్స్ ను అవమానపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలి."_సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్
దసరా సినిమా: నేచురల్ స్టార్ నాని వినూత్నంగా ప్రయత్నం చేసిన సినిమా 'దసరా'. ఊరమాస్‌లుక్‌లో కనిపించిన నాని పాత్రకు ప్రాణం పోసి నటించాడు. పాన్ ఇండియా సినిమా 'దసరా' గురువారం శ్రీరామనవమి రోజున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాజిక మాధ్యమాలలో మంచి రెస్పాన్స్ వస్తోంది. తన కెరీర్లో నాని ఈ సినిమాలో చాలా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడని అభిమానులు కొనియాడుతున్నారు. సినిమాలో చూపించిన ప్రతి సన్నివేశం అదిరిపోయిందని, సినిమాలో పాత్రలు కూడా చాలా బాగున్నాయని అభిమానుల టాక్. సినిమాలో నటించిన నాని, కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, సాయికుమార్లు ముఖ్య పాత్రలను పోషించి తమ నటనతో అలరించారని ప్రేక్షకులు చెబుతున్నారు.
కథా నేపథ్యం: తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతోంది. ముగ్గురు స్నేహితులు చిన్ననాటి నుంచి వారి మధ్య మంచి బంధం ఉంది. స్నేహితుడి కోసం తన ప్రేమనే త్యాగం చేసిన ఫ్రెండ్. వారు కలిసున్నప్పుడు రైళ్లలో బొగ్గు దొంగిలించడం, తాగడం, అందరూ కలిసి తిరగుతూ ఉండటం ఇది వారు ప్రతిరోజు చేసే పని. ఆనందంగా సాగుతున్న వారి లైఫ్‌లో గ్రామంలో జరిగే ఉపసర్పంచ్ ఎన్నికలు మార్చేస్తాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదే ఈ సినిమా కథ అన్నమాట.
ఇవీ చదవండి: