ఆదిలాబాద్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. దిల్లీలో న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ జిల్లా కోర్టు ప్రాంగణంలో లాయర్లంతా కలిసి నిరసన తెలిపారు. ప్రధాన ద్వారం ముందు నిలబడి పోలీసుల చర్యకు నిరసనగా నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః 'అతని నుంచి నన్ను రక్షించండి'