ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కడెంనది, గాయత్రిజలపాతంలో జాతీయ సాహస సన్నాహక క్రీడలను నిర్వహించారు. ఇందులో భాగంగా వాటర్ రాపేల్లింగ్ ఫీలింగ్, జుమార్, రాఫ్టింగ్ క్లైంబింగ్, బోటింగ్ తదితర సాహస క్రీడలు నిర్వహించగా... రెండు తెలుగు రాష్ట్రలకు సంబంధించిన 20 మంది సాహస క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ అధ్యక్షుడు రంగారవు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సాహస క్రీడలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.
ఇవీ చూడండి: సమ్మెపై ప్రభుత్వ, యూనియన్ల తీరుపై హైకోర్టు అసంతృప్తి