ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఈ రోజు వేకువజాము నుంచే విధుల్లో చేరారు. 54 రోజుల నిరీక్షణ అనంతరం కార్మికులు సంతోషంగా విధుల్లో చేరేందుకు అరగంట ముందే డిపోకు చేరుకున్నారు. కేసీఆర్ నిర్ణయం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తూ బస్సులను ముందుకు తీసుకెళ్లారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు