ఆదిలాబాద్ జిల్లా నూతన పాలనాధికారిగా సిక్తాపట్నాయక్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీదేవసేన విద్యాశాఖ సంచాలకులుగా బదిలీ కాగా... ఆమె స్థానంలో పెద్దపల్లి పాలనాధికారిగా పనిచేస్తున్న సిక్తా పట్నాయక్‌ను ప్రభుత్వం నియమించింది.
కలెక్టర్ ఛాంబర్‌లో శ్రీదేవసేన నుంచి బాధ్యతలు తీసుకున్న సిక్తా పట్నాయక్.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. జిల్లా అధికారులు నూతన కలెక్టర్కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.