ముగ్గురు సంతానం ఉన్నా ఎన్నికల బరిలో నిలిచి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ జడ్పీటీసీగా చారులత విజయం సాధించారని, ఇది రాజ్యంగ విరుద్ధమని భాజపా అభ్యర్థి మెస్రం భాగ్యలక్ష్మీ ఆరోపించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చారులతకు సంబంధించిన పూర్తి వివరాలతో హైకోర్టును ఆశ్రయించామని ఆదివాసీ సంఘం నాయకులు తెలిపారు.
- ఇదీ చూడండి : అమ్మకే అమ్మ అయిన చిన్నారి