ఆదిలాబాద్ జిల్లాలో నాయీ బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపుగా పదిహేను వందల కుటుంబాల బతుకులపై లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆదాయాన్ని కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల కోసం... తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే... ప్రభుత్వం తరఫున ఉచితంగా క్షౌర దుకాణాలకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు సరఫరా చేయాలంటున్న నాయీబ్రాహ్మణులతో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి...
ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపి లేక రోగుల విలవిల