ETV Bharat / state

విలువిద్యలో రాణిస్తున్న ఆదివాసి బిడ్డలు - అంతర్జాతీయ పోటీల్లో గెలవాలన్నదే వారి లక్ష్యం - ఆదిలాబాద్ ఆర్చరీ లక్ష్మి కథ

Adilabad Archeries Lakshmi, Sunil Participating on National Level Sports : ఒకరు గోండు బిడ్డడు. మరోకామె కొలాం బిడ్డ. అయితేనేం? ప్రత్యేకంగా ఏమైనా సాధించాలి. దేశానికి పేరు తీసుకురావలనే సంకల్పం, తపన వారి సొంతం. కానీ, చేతిలో చిల్లిగవ్వలేని పేదరికం. అయినా పట్టుదల ఉంటే ప్రకృతీ సహకరిస్తుందని నమ్మి విలువిద్యలో ఆరితేరారు. ఆదరించేవారు లేక వెనకబడిన ఓ యువకుడు వారి పాలిట గురవయ్యాడు. ఉన్న వసతులనే ఆసరా చేసుకుని మెళకువలు నేర్చుకున్నారు. ఏడాది తిరిగేసరికి జాతీయ స్థాయి విలువిద్యకారులుగా ఎదిగిన ఆ ఆదివాసీ బిడ్డలు కథ ఇది.

adilabad tribal Youth in Archery
Adilabad Archeries Lakshmi, Sunil Participating on National Level Sports
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 5:37 PM IST

Adilabad Archeries Lakshmi, Sunil Participating on National Level Sports

Adilabad Archeries Lakshmi, Sunil Participating on National Level Sports : విల్లు ఎక్కు పెట్టినప్పుడు ఇదో ఆట, ఇందులో గెలిస్తే పతకాలు సాధించవచ్చనే విషయం కూడా వీరికి సరిగ్గా తెలిదు. కానీ, పచ్చని ప్రకృతిలో పెరుగుతూ వారి సంప్రదాయంగా నేర్చుకునే ఈ విల్లు ఆటపై మక్కువ పెంచుకున్నారు. అదే మక్కువ పాఠశాల వరకు తీసుకొస్తే ఉపాధ్యాయులు, కోచ్‌లు ప్రోత్సహించారు. ఫలితంగా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు ఈ మట్టిలో మాణిక్యాలు.

11 ఏళ్ల వయసులోనే అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్ బాలిక - శాస్త్రవేత్తగా ఇస్రో, నాసాలో సేవలందించడమే లక్ష్యం

ఆదిలాబాద్‌ జిల్లా ఆదివాసీ బిడ్డలైన వీరి పేర్లు టేకం సునీల్‌, టేకం లక్ష్మి. వీరిలో కొలాం తెగకు చెందిన లక్ష్మీది ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం పరిధిలోకి వచ్చే మొలాల్‌గుట్ట గూడెం. గోండ్‌ తెగకు చెందిన సునీల్‌ది నిర్మల్‌ జిల్లా కడెం మండలం పరిధిలోకి వచ్చే గంగాపూర్‌. ఇద్దరూ ప్రభుత్వ గిరిజన కళాశాలలో చదువుతూనే విలువిద్యలో జిల్లా, రాష్ట్రస్థాయి ప్రతిభ కనబర్చిచారు.

Special Story on Medical Student Mahender : డాక్టర్ అయ్యేందుకు స్పీడ్​ బ్రేకర్​గా పేదరికం.. ఎవరైనా సాయం చేస్తే..!

సునీల్‌, లక్ష్మీ సంకల్పాన్ని దగ్గర నుంచి చూశాడు ఆదివాసీ యువకుడు మారుతీ. వీళ్లు పడుతున్న కష్టం తన హృదయాన్ని కదిలించింది. తనలాగే ఈ క్రీడాకారుల ఆలోచనలు ఆవిరి కాకూడదని భావించి నేనున్నానంటూ వెన్నుతట్టాడు. సంవత్సరంపాటు మెలకువలు నేర్పాడు. ఫలితంగా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి పతకాలు సాధించారు ఈ క్రీడాకారులు.

"చిన్నప్పటి నుంచి ఆర్చరీ ఆడాలని చాలా ఇష్టం. మారుతీ సార్ నేర్పించారు. జాతీయ స్థాయి పోటీల సెలక్షన్స్ అయితే వెళ్లాను నాకు స్థానం దక్కింది. గుజరాత్​లో జాతీయ స్థాయిలో పోటీ చేేసి మెడల్ సాధిస్తాను. దేశానికి మంచి పేరు తెవాలని అనుకుంటున్నాను." - లక్ష్మీ, విలువిద్యకారిణి

Archeries Lakshmi, Sunil Participating on National Level Sports : మారుమూల గ్రామం నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించడం అంటే మాటలు కాదు. పైగా జూనియర్‌ విభాగంలో రాష్ట్రం తరఫున ఉన్న అత్యుత్తమ ఆర్చర్లలో ఒకరిగా నిలిచారు ఈ క్రీడాకారులు. ఎవరో దాతలు కనకరిస్తే తప్ప క్రీడ సామాగ్రిని కొనుగోలు చేయలేని పరిస్థితి వీరిది. కానీ విలువిద్యలో రాణించాలనే తపనకు మాత్రం కొదవలేదు.

18 Years Handicapped Man Story in Warangal : ఆదుకోండి సర్.. ఉపాధికి దారి చూపించండి..

పట్టుదల, నిరంతర సాధనతో ఈ నెల 18 నుంచి గుజరాత్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు ఈ క్రీడాకారులు. చేతిలో ఉన్న అరకొర సామాగ్రితోనే గుజరాత్‌ వెళ్తున్నా తొలి ప్రయత్నంలోనే విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారీ మట్టి బిడ్డలు.

సహజంగా జాతీయస్థాయి పోటీలేవైనా ఆధునిక పరికరాలు, హంగూ ఆర్భాటాలతో క్రీడాకారులు హాజరవుతారు. పౌష్టికాహారంతో పాటు కార్పొరేట్‌ స్థాయిలో మెలుకువలు నేర్చుకుని పోటీలకు ధీటుగా నిలబడతారు. అయితే అడవితల్లి ఇచ్చే సంకల్పబలం తప్ప మరే ప్రోత్సాహం లేదు. ప్రభుత్వం, దాతలు ఎవరైనా చేయూతనిస్తే సునీల్‌, లక్ష్మీలు అద్భుతంగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదంటున్నాడు శిక్షకుడు.

Special Story On Nalgonda Shaik Sayyed PhD : తినడానికి తిండి లేని స్థితి నుంచి డాక్టరేట్​గా.. సయ్యద్ ప్రయాణం ఆదర్శప్రాయం

విలువిద్యలో రాణించాలనే తపనతో జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమయ్యారు ఈ ఆదివాసీ బిడ్డలు. పుట్టిన గ్రామానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కఠోర సాధన చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించటమే ముందున్న లక్ష్యమంటున్నారు ఈ క్రీడా రత్నాలు.

Hyderabad Begging Mafia : సాయం పేరిట సంపాదన.. NGO పేరిట భిక్షాటన.. బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.