ఆదిలాబాద్ జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో తెరాస, భాజపాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. 44 వ జాతీయ రహదారి సర్వీసు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనుల్లో జాప్యంతో తెరాస ప్రభుత్వంపై, భాజపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఆయా పనులను ప్రారంభించిన భాజపా ఎంపీ సోయం బాపురావు.. తెరాస నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆ పనులు మంజూరు చేయించింది తానేనని తెరాస మాజీ ఎంపీ గోడం నగేశ్.. మీడియా సమావేశంలో వెల్లడించారు. తాను చేయలేని పనులను ప్రజల మేలు కోసం ఎప్పుడు చేయిస్తారో నిర్దిష్ట సమయం చెప్పాలని నగేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్'