ETV Bharat / sports

Olympics 2020: రికార్డులు కొల్లగొట్టి.. పతకాలు ఒడిసిపట్టి.. - Naomi Osaka

ఒలింపిక్స్​ వేదికగా ఎంతోమంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన చేసి పతకాలను సాధించారు. మరి కొంతమంది అథ్లెట్లు మెడల్స్​ సాధించకపోయినా.. తమ అసమానమైన ఆటతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. అయితే ఇంతటి విశ్వవేదికపై(Tokyo Olympics) జరిగిన పతకాల వేటలో కొందరు చిరస్మరణీయమైన ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. ఆ రికార్డులు? టోక్యో ఒలింపిక్స్​ విశేషాల గురించి తెలుసుకుందాం..

World records that have been broken at the Tokyo Olympics
Tokyo Olympics: ప్రపంచ రికార్డులు.. వ్యకిగత ఘనతలివే!
author img

By

Published : Aug 9, 2021, 6:31 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో (Tokyo Olympics)​ రెండు వారాలుగా ఉత్కంఠభరిత క్రీడలను చూశాం. ఈ విశ్వక్రీడల వేదికగా ఎంతో మంది క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకొని పతకాలను సాధించగా.. మరికొంత మంది ఆటతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. అయితే వీరితో చాలా తక్కువ మంది అథ్లెట్లు ఒలింపిక్స్​లో పతకాలతో పాటు ప్రపంచ రికార్డులను తమ పేరుతో లిఖించుకున్నారు. పురుషుల 100 మీ. బటర్​ఫ్లై స్విమ్మింగ్​లో కాలేబ్​ డ్రెస్సెల్​ నుంచి.. మహిళల 400 మీ. హార్డిల్స్​లో మెక్​లాగ్లిన్​ వరకు ఎంతోమంది క్రీడాకారులు ఈ వేదిక ద్వారా చరిత్రకెక్కారు. అలా టోక్యో ఒలింపిక్స్​లో నమోదైన సరికొత్త ప్రపంచ రికార్డులు ఏవో తెలుసుకుందాం.

మహిళల ట్రాక్​ సైక్లింగ్​ టీమ్​ ఈవెంట్​లో జర్మనీ ప్రపంచ రికార్డు:

World records that have been broken at the Tokyo Olympics
జర్మనీ ట్రాక్​ సైక్లింగ్​ టీమ్

జర్మనీకి చెందిన మహిళల ట్రాక్​ సైక్లింగ్​ టీమ్​.. టోక్యో ఒలింపిక్స్​లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఫ్రాంజిస్కా బ్రౌసే(Franziska Brausse), లీసా బ్రెన్నౌర్​(Lisa Brennauer), లీసా క్లెయిన్​(Lisa Klein), మైక్​ క్రోజెర్​(Mieke Kroeger).. కలిసి ఈ ఘనతను సాధించారు. ఈ ట్రాక్​లో ఉన్న ప్రపంచ రికార్డును(4:06.166) రెండు సెకన్లు ముందుగా అంటే 4:04.242 సమయంలో ఈ రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించారు. ఈ పోటీలో ఇప్పుడిదే రికార్డు!

పురుషుల సైక్లింగ్​ పర్స్యూట్​ ఫైనల్లో ఇటలీ టీమ్​ సరికొత్త రికార్డు:

ఇటలీ పురుషుల పర్స్యూట్​ జట్టు

సైక్లింగ్​ పర్స్యూట్​ ఈవెంట్​లో ఇటలీ పురుషుల జట్టు(Italian pursuit team) ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 3:42.032 సమయంలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది. 61 ఏళ్లగా ఈ ఈవెంట్​లో ఇటలీకి ఇదే తొలి స్వర్ణం.

200 మీ. బ్రెస్ట్​ స్ట్రోక్​ ఈవెంట్​లో మహిళా స్విమ్మర్​ రికార్డు:

తజన స్కోన్ మేకర్

దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా స్విమ్మర్​ తజన స్కోన్ మేకర్(Tatjana Schoenmaker).. ఒలింపిక్స్​ 200 మీ. బ్రెస్ట్​ స్ట్రోక్​ ఈవెంట్​లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతకుముందు ఈ రికార్డు డెన్మార్క్​కు చెందిన రిక్కే మోల్లెర్ పెడెర్సెన్(2:19.11) పేరిట ఉండగా.. ఇప్పుడా రికార్డు తజన స్కోన్​ మేకర్(​2:18.95) సొంతం చేసుకుంది.1996 తర్వాత దక్షిణాఫ్రికాకు స్వర్ణ పతకం సాధించిన తొలి స్విమ్మర్​గా స్కోన్​ ఘనత సాధించింది.

100 మీ. బటర్​ఫ్లై ఈవెంట్​లో అమెరికా స్విమ్మర్​ వరల్డ్​ రికార్డు:

స్విమ్మర్​ డ్రెసెల్‌

భారీ అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన అమెరికన్​ స్విమ్మర్​ డ్రెసెల్‌(Caeleb Dressel).. ఒలింపిక్స్​లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. పురుషుల 100 మీ. బటర్​ఫ్లై ఈవెంట్​ ఫైనల్లో 49.45 సెకన్లలో రేసును పూర్తి చేసి.. ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలుచుకున్నాడు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో అతనే నెలకొల్పిన రికార్డును (49.50సె) ఇప్పుడు మెరుగుపర్చుకున్నాడు.

4x100 మీ. మెడ్లీ రిలే పోటీల్లో అమెరికా టీమ్​ రికార్డు:

4x100 మీటర్ల మెడ్లే రిలే ఈవెంట్​లో అమెరికా టీమ్

4x100 మీటర్ల మెడ్లే రిలే ఈవెంట్​లో అమెరికా టీమ్​ విజేతగా నిలిచింది. ఈ పోటీని ర్యాన్​ మర్ఫీ(Ryan Murphy), మైకేల్​ ఆండ్రూ(Michael Andrew), కెలెబ్​ డ్రెస్సెల్​(Caeleb Dressel), జాక్​ యాపిల్​(Zach Apple) బృందం కేవలం 3:26.78 సమయంలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పి.. తమ దేశానికి బంగారు పతకాన్ని సాధించి పెట్టారు.

మహిళల స్పీడ్​ క్లైంబింగ్​లో అలెక్జాండ్రా మిరోస్లా ప్రపంచ రికార్డు:

అలెక్సాండ్రా మిరోస్లా

పోలాండ్​కు చెందిన అలెక్సాండ్రా మిరోస్లా(Aleksandra Mirosław).. టోక్యో ఒలింపిక్స్​ వేదికగా మహిళల స్పీడ్​ క్లైంబింగ్​లో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 15 మీటర్ల ఎత్తును 6.84 సెకన్లలో స్పీడ్​ క్లైంబ్​ చేసి.. ఈ ఘనత సాధించింది. అంతకు ముందు ఈ రికార్డు రష్యాకు చెందిన ఇయులియా కల్పినా(6.96 సెకన్లు) పేరుతో ఉంది.

వెయిట్​లిఫ్టింగ్​లో జార్జియా క్రీడాకారుడు రికార్డు:

వెయిట్​లిఫ్టర్​ లాషా తలఖడే

జార్జియాకు చెందిన లాషా తలఖడే (Lasha Talakhadze).. అంతకుముందు తన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును తానే అధిగమించాడు. వెయిట్​లిఫ్టింగ్ ఈవెంట్​లో మొత్తంగా 488 కేజీల బరువునెత్తాడు. స్నాచ్​ రౌండ్​లో 223 కేజీలు.. క్లీన్ అండ్​ జెర్క్​ రౌండ్​లో 265 కేజీల బరువు ఎత్తి, రెండు విభాగాల్లోనూ వరల్డ్​ రికార్డును నమోదు చేశాడు. వివిధ క్రీడల్లో బంగారు పతకాలను సాధించిన తొలి జార్జియా క్రీడాకారుడిగా లాషా తలఖడే నిలిచాడు.

4x100 మీ. ఫ్రీస్టైల్​ ఈవెంట్​లో ఆస్ట్రేలియా టీమ్​ వరల్డ్​ రికార్డు:

ఆస్ట్రేలియా మహిళల 4x100 మీటర్ల రిలే స్విమ్మింగ్​ టీమ్​

టోక్యో ఒలింపిక్స్​ మహిళల 4x100 మీటర్ల రిలే స్విమ్మింగ్​ పోటీల్లో ఆస్ట్రేలియా బృందం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఎమ్మా మెక్​కియాన్​(Emma McKeon), మెగ్​ హారిస్​(Meg Harris), కేట్​ కాంప్​బెల్​(Cate Campbell), బ్రోంటే కాంప్​బెల్​(Bronte Campbell).. ఈ పోటీని కేవలం 3:29.69 సమయంలో పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించారు.

ట్రిపుల్​ జంప్​లో వెనిజువెలా అథ్లెట్​ ప్రపంచ రికార్డు:

యులిమార్ రోజాస్

వెనిజువెలాకు చెందిన మహిళా అథ్లెట్​ యులిమార్ రోజాస్(Yulimar Rojas).. ట్రిపుల్​ జంప్​లో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 15.67 మీటర్లు జంప్​ చేసి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అంతకుముందు ఉక్రెయిన్​కు చెందిన ఇనెస్సా క్రావెట్స్(15.50 మీటర్లు) పేరిట ఈ ఘనత ఉంది.

400 మీటర్ల హర్డిల్స్​లో నార్వే అథ్లెట్​ ప్రపంచ రికార్డు:

వార్​హోమ్

నార్వేకు చెందిన వార్​హోమ్(Karsten Warholm)​ 400 మీ. హర్డిల్స్​ విభాగంలో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. 45.94 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త ఘనతను సృష్టించాడు. గతనెలలో కెవిన్​ యంగ్​ పేరిట ఉన్న 46.70 సెకన్ల రికార్డును 46 సెకన్లలో అధిగమించిన వార్​హోమ్​.. ఇప్పుడు తన రికార్డును ఒలింపిక్స్​ వేదికగా తానే అధిగమించాడు.

టోక్యో ఒలింపిక్స్​లో వ్యక్తిగత రికార్డులు..

ఎమ్మా మెక్​కియాన్​

ఒలింపిక్స్​ చరిత్రలో ఒకేసారి ఏడు పతకాలు సాధించిన మహిళగా ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్​ ఎమ్మా మెక్​కియాన్​ ఘనత సాధించింది. అంతకుముందు ఈస్ట్​ జర్మన్​ క్రిస్టిన్​ ఓట్టో పేరిట ఉన్న ఆరు పతకాల రికార్డును కేలీ మెక్​కియాన్​ అధిగమించింది. 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన విశ్వక్రీడల్లో ఇంతటి ఘనత సాధించిన ఏకైక మహిళగా చరిత్ర పుటలకెక్కింది. ఆమె సాధించిన పతకాల్లో నాలుగు స్వర్ణ, మూడు కాంస్య పతకాలున్నాయి.

బోల్ట్​ వారసుడు

లామోంట్‌ మార్సెల్‌ జాకబ్స్‌

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 100 మీటర్ల పరుగు పందెంలో ఎవరి ఊహకూ అందని రీతిలో ఇటలీకి చెందిన అథ్లెట్‌ లామోంట్‌ మార్సెల్‌ జాకబ్స్‌(Lamont Marcell Jacobs) విజయం సాధించాడు. ఒలింపిక్స్​లో జరిగిన పోటీలో కేవలం 9.80 సెకన్లలో అతడు గమ్యాన్ని చేరుకున్నాడు.

వైఫల్యంతో ఒకే పతకం

జిమ్నాస్ట్​ సిమోన్​ బైల్స్

రియోలో నాలుగు స్వర్ణాలు, ఓ కాంస్యం సాధించిన రికార్డును.. అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్​ సిమోన్​ బైల్స్(Simone Biles)​ టోక్యో ఒలింపిక్స్​లోనూ కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. ఈ విశ్వక్రీడల్లోని ఆరు ఈవెంట్లలో ఆమె బరిలో నిలిచింది. కానీ ఆమె అనూహ్యంగా మానసిక సమస్య 'ట్విస్టీస్‌' వల్ల వరుసగా ఈవెంట్స్​ నుంచి తప్పుకుంది. కానీ, చివరిగా​ మహిళల బ్యాలన్స్​ బీమ్​ ఫైనల్​ విభాగంలో కాంస్య పతకం గెలుపొందింది. 14.000 స్కోరు సాధించిన బైల్స్​ బ్రాంజ్​తో సరిపెట్టుకుంది.

టెన్నిస్​ స్టార్స్​ నిరాశ

జకోవిచ్​

ఈ ఏడాది 3 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు నెగ్గిన టెన్నిస్​ స్టార్​ జకోవిచ్​(Novak Djokovic).. టోక్యో ఒలింపిక్స్​లో కనీసం కాంస్య పతకం కూడా గెలుచుకోలేక పోయాడు. మరోవైపు ఫేవరేట్​గా బరిలో దిగిన స్థానిక టెన్నిస్​ స్టార్​ నవోమి ఒసాకా(Naomi Osaka) కూడా నిరాశ పరిచింది.

నవోమి ఒసాకా

ఇదీ చూడండి.. India at Olympics: ఫేవరేట్లుగా వెళ్లి.. ఉసూరుమనిపించారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.