టోక్యో పారాలింపిక్స్‌లో ఆదివారం జరిగిన డిస్కస్ త్రో పోటీలో వినోద్ కాంస్యం(Vinod Kumar Discus throw) గెలిచినట్లు తొలుత ఖరారైనప్పటికీ దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ పతకాన్ని హోల్డ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. వినోద్ డిసేబిలిటీ క్లాసిఫికేషన్‌పై(Disability Classification) ఓ దేశం సందేహాలు లేవనెత్తి, ఫిర్యాదు చేసిన కారణంగా.. పతకాన్ని హోల్డ్‌లో పెట్టారు అధికారులు.
వినోద్(41).. 19.91 మీటర్ల దూరం డిస్కస్ త్రో చేసి మూడో స్థానంలో నిలిచాడు. పోలాండ్‌కు చెందిన పీయోటర్ కోసెవిక్జ 20.02 మీటర్లతో స్వర్ణం సాధించగా.. క్రోయేషియాకు చెందిన వెలిమిర్ సాండర్ 19.98 మీటర్లతో రజతం దక్కించుకున్నాడు.
అయితే.. ఎఫ్52 కేటగిరీలో వినోద్(Vinod Kumar Paralympics) ఎంపికపై అనుమానం వ్యక్తం చేశారు కొందరు పోటీదారులు. వాస్తవానికి.. ఆగస్టు 22నే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తైంది. అయినప్పటికీ పోటీదారుల అనుమానం దేనిపై అన్న విషయం మీద స్పష్టత లేదు. ఆగస్టు 30 సాయంత్రంలోపు వినోద్ సాధించిన కాంస్య పతకంపై స్పష్టత రానుంది.
బలహీనమైన కండరాల శక్తి, పరిమిత స్థాయి కదలిక, అవయవ లోపం లేదా కాళ్ల పొడవులో వ్యత్యాసం, వెన్నముక గాయంతో ఉన్న వారికి ఎఫ్52 పోటీలో పాల్గొనేందుకు అనుమతిస్తారు.
ఇదీ చదవండి:పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. వినోద్‌కు కాంస్యం