ETV Bharat / sports

సుప్రీం ఆదేశించినా.. పారాలింపియన్​కు తప్పని నిరాశ! - పారాలింపిక్​ షూటర్​ నరేష్​

భారత పారాలింపిక్స్​ బృందంలో షూటర్​ నరేశ్​ కుమార్​ను చేర్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. ఆయనకు నిరాశ తప్పలేదు. సోమవారంతో టోక్యో ఒలింపిక్స్​ ఎంట్రీల గడువు ముగియడం వల్ల షూటర్​ కోసం అదనపు స్లాట్​ను బుక్​ చేయలేమని టోక్యో పారాలింపిక్స్​ నిర్వాహకులు తెలియజేసినట్లు పారాలింపిక్​ కమిటీ ఆఫ్​ ఇండియా(పీసీఐ) కోర్టుకు విన్నవించుకుంది.

Tokyo refuses to allot additional slot for Paralympian shooter, SC informed
సుప్రీం ఆదేశించినా.. పారాలింపియన్​కు తప్పని నిరాశ
author img

By

Published : Aug 3, 2021, 4:38 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో పారాలింపియన్​ షూటర్​ నరేశ్​ కుమార్​ శర్మకు అదనపు స్లాట్​ బుక్​ చేసేందుకు నిర్వాహకులు అంగీకరించలేదని పారాలింపిక్​ కమిటీ ఆఫ్​ ఇండియా(పీసీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. పారాలింపిక్స్​ కోసం ఉద్దేశించిన 10 స్లాట్లలో 8 మంది పురుషులు, ఇద్దరు మహిళలను ఇప్పటికే ఎంపికచేసినట్లు న్యాయస్థానానికి వెల్లడించింది.

దీంతో నరేశ్​ కుమార్​ శర్మకు టోక్యోలో అవకాశం ఇవ్వలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పారాలింపిక్స్​లో పాల్గొనే అథ్లెట్లు ఇప్పటికే బయోబబుల్​లో ఉన్నట్లు పీసీఐ పేర్కొందని తెలిపింది.

అయితే సెలక్షన్​ విషయంపై తాము జోక్యం చేసుకోబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఈ విషయంలో అవసరమైతే చర్యలు తీసుకునే అధికారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ఉందని చెప్పింది.

ఏం జరిగిందంటే?

పారాలింపిక్స్​ కోసం భారత బృందంలో తనను ఎంపిక చేయకపోవడంపై సుప్రీంకోర్టును మంగళవారం ఆశ్రయించారు పారాలింపియన్​ షూటర్​ నరేశ్​ కుమార్ శర్మ. ఐదు సార్లు పారాలింపిక్స్​లో పాల్గొన్న తనను ఈసారి ఎంపిక చేయకపోవడంపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. దీన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. షూటర్​ నరేశ్​ను తక్షణమే భారత జట్టులో చేర్చాలని ఆదేశించింది. అయితే పారాలింపిక్స్​కు ఎంట్రీలు పంపేందుకు సోమవారంతో గడువు ముగిసింది.

ఇదీ చూడండి.. సుప్రీం ఆదేశంతో పారాలింపిక్స్​ బృందంలోకి షూటర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.