ఆగస్టు 24 నుంచి జరిగే టోక్యో పారాలింపిక్స్ క్రీడలకు వీక్షకులను అనుమతించేది లేదని నిర్వాహకులు ప్రకటించారు. జపాన్‌లో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పరిమిత సంఖ్యలో వీక్షకులను నిర్వాహకులు అనుమతించారు. ఈసారి కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనే చిన్నారులు మినహా ఇంకెవరిని అనుమతించబోమని ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ తెలిపింది. అటు టోక్యో నగర ప్రజలను కూడా క్రీడలు జరిగే ప్రాంతానికి రావొద్దని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా టోక్యో సహా ఇతర ప్రాంతాల్లో విధించిన అత్యాయిక పరిస్థితి సెప్టెంబర్ 12 వరకూ పొడిగిస్తున్నట్లు జపాన్ ప్రధాని యోషిహిడే సుగా ప్రకటించారు. ఆగస్టు 24న జరిగే పారాలింపిక్స్ క్రీడల్లో అన్ని దేశాలు కలిపి 4వేల 400మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.
ఇదీ చూడండి: టీ బ్రేక్: విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్