ETV Bharat / sports

Tokyo Olympics: 100 మీ. పరుగులో 33 ఏళ్ల రికార్డు బద్దలు

ఒలింపిక్స్​ మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో జమైకాకు చెందిన ఎలెన్‌ థామ్సన్‌ రికార్డు సృష్టించింది. కేవలం 10.61 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. ఫలితంగా స్వర్ణాన్ని దక్కించుకుంది.

OLYMPICS
ఎలెన్​
author img

By

Published : Jul 31, 2021, 8:50 PM IST

Updated : Aug 1, 2021, 6:55 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో మరో రికార్డు నమోదైంది. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఎలెన్‌ థామ్సన్‌(జమైకా) రికార్డు సృష్టించింది. కేవలం 10.61 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒలింపిక్స్‌ క్రీడల్లో ముఖ్యంగా మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో అతితక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకున్న రెండో అథ్లెట్‌గా రికార్డు నమోదు చేసింది.

ఎలెన్​ కన్నా ముందు 1988 ఒలింపిక్స్‌లో గ్రిఫిన్ జాయ్‌నెర్ 10.49 సెకన్ల 100 మీటర్ల పరుగు పందేన్ని పూర్తి చేయడం ఇప్పటికీ రికార్డే. ఇక థామ్సన్‌ తర్వాతి స్థానంలో రెండుసార్లు ఛాంపియన్‌ అయిన షెల్లీ అన్నా ఫ్రాసెర్‌ను 10.74 సెకన్లతో గమ్యాన్ని చేరుకుని రజతాన్ని, షెరికా జాక్సన్‌ 10.76 సెకన్లతో కాంస్య పతకాలను దక్కించుకున్నారు.

ఒలింపిక్స్‌లో ఆరు గోల్డ్‌ మెడల్స్‌ లెడిక్కీవే..

ఒలింపిక్స్‌ మహిళల స్విమ్మింగ్‌ విభాగంలో అమెరికా స్విమ్మర్‌ కేటీ లెడిక్కీ శనివారం కొత్త చరిత్ర సృష్టించింది. ఆమె ఒలింపిక్స్‌ కెరీర్‌లో వ్యక్తిగతంగా మొత్తం 8 బంగారు పతకాలు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈరోజు టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్‌ ఈత పోటీల్లో ఈ అమెరికా క్రీడాకారిణి అగ్రస్థానంలో నిలిచి ఈ ఒలింపిక్స్‌లో రెండో బంగారు పతకం సాధించింది. అంతకుముందు 1500 మీటర్ల విభాగంలోనూ మరో గోల్డ్‌ తన ఖాతాలో వేసుకుంది.

olympics
లెడిక్కి

ఇక ఆస్ట్రేలియాకు చెందిన అరియర్న్‌ టిట్మస్‌ ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి రజతం సంపాదించగా.. ఇటలీ స్విమ్మర్‌ సిమోనా క్వాడరెల్లా కాంస్యం కైవసం చేసుకుంది. లెడిక్కీ 1500 మీటర్లలోనూ టిట్మస్‌ను ఓడించి బంగారు పతకం సాధించడం గమనార్హం. అలాగే ఈసారి ఒలింపిక్స్‌ ఈ అమెరికా స్విమ్మర్‌ మరో రెండు వెండి పతకాలు కూడా సొంతం చేసుకుంది. కాగా, 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఇంతకన్నా మెరుగైన ప్రదర్శన చేసింది. అప్పుడు ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించగా ఒక వెండి పతకాన్ని కూడా సొంతం చేసుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది.

ఇదీ చూడండి:- Tokyo Olympics: సెమీస్​లో సింధు ఓటమి.. స్వర్ణం ఆశలు ఆవిరి

Last Updated : Aug 1, 2021, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.