ETV Bharat / sports

జిమ్నాస్ట్​ బైల్స్​కు కాంస్యం.. టోక్యోలో ఏకైక పతకం - జిమ్నాస్ట్​ సిమోన్ బైల్స్

రియో ఒలింపిక్స్​ గోల్డ్​ మెడలిస్ట్​, ప్రముఖ అమెరికా జిమ్నాస్ట్​ సిమోన్​ బైల్స్​ తాజా విశ్వక్రీడల్లో ఎట్టకేలకు ఓ పతకం తన ఖాతాలో వేసుకుంది. మహిళల బ్యాలన్స్​ బీమ్ ఫైనల్​ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకుంది.

gymnast simone biles
జిమ్నాస్ట్​ సిమోన్ బైల్స్
author img

By

Published : Aug 3, 2021, 10:30 PM IST

అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్​ సిమోన్ బైల్స్​ మహిళల బ్యాలన్స్​ బీమ్​ ఫైనల్​ విభాగంలో కాంస్య పతకం గెలుపొందింది. 14.000 స్కోరు సాధించిన బైల్స్​ బ్రాంజ్​తో సరిపెట్టుకుంది. చైనా అథ్లెట్లు గుహన్​ చెంచెన్ స్వర్ణం గెలువగా, తంగ్​ గ్జింజింగ్ వెండితో మెరిసింది.

ఆరింట్లో ఒక్కటే..

రియో గేమ్స్​లో నాలుగు స్వర్ణాలు, ఓ కాంస్యం సాధించిన రికార్డును.. బైల్స్​ టోక్యో ఒలింపిక్స్​లోనూ కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. టోక్యో ఒలింపిక్స్​లో ఆరు ఈవెంట్లలో బరిలో నిలిచింది. కానీ ఆమె అనూహ్యంగా మానసిక సమస్య 'ట్విస్టీస్‌' వల్ల వరుసగా ఈవెంట్స్​ నుంచి తప్పుకుంది. ఇటీవలే టీమ్‌ ఈవెంట్‌, వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌, వాల్ట్‌, అన్‌ ఈవెన్‌ బార్స్‌ ఫైనల్స్​, ఫ్లోర్ ఎక్స‌ర్‌సైజ్​ ఫైనల్​కు దూరమైంది.

ఇదీ చదవండి: Lovlina Borgohain: 'సెమీస్​లో గెలుస్తా.. సరికొత్త రికార్డు సృష్టిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.