ETV Bharat / sports

Olympics 2020: విశ్వక్రీడలు దిగ్విజయం- అట్టహాసంగా వేడుకలు - టోక్యో ఒలింపిక్స్​ 2020

రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను అలరించిన టోక్యో ఒలింపిక్స్​ ముంగిపు కార్యక్రమం (Olympics Closing Cenrmony) అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్​ నుంచి దాదాపు 10 మంది అథ్లెట్లు/ అధికారులు హాజరయ్యారు.

Tokyo Olympics 2020 Closing Ceremony
ఘనంగా టోక్యో ఒలింపిక్స్​ ముగింపు వేడుక
author img

By

Published : Aug 8, 2021, 5:23 PM IST

Updated : Aug 8, 2021, 5:53 PM IST

కరోనా నేపథ్యంలో ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్​ను(Olympics Closing Cenrmony) విజయవంతంగా నిర్వహించింది జపాన్​ ప్రభుత్వం. 1964 తర్వాత రెండోసారి నిర్వహించిన జపాన్​ ఎలాంటి అవాంతరాలు లేకుండా క్రీడలను సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంది. విశ్వక్రీడలను నిలిపేయాలంటూ అక్కడి ప్రజల నుంచే వ్యతిరేకత లభించిన క్రమంలో కరోనా ఛాయలు లేకుండా ఆటలను నిర్వాహకులు ముగించారు.

Tokyo Olympics 2020 Closing Ceremony
టోక్యో ఒలింపిక్స్​ ముగింపు వేడుక
Tokyo Olympics 2020 Closing Ceremony
ముగింపు వేడుకలో భారత అథ్లెట్లు

ఆదివారం రాత్రి ఈ క్రీడా సంరంభానికి ఘనంగా ముగింపు పలికారు. ఈ కార్యక్రమంలో భారత్​ నుంచి దాదాపు 10 మంది అథ్లెట్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Tokyo Olympics 2020 Closing Ceremony
ఒలింపిక్స్​ ముగింపు వేడుకలో క్రీడాకారుల కోలాహలం

విద్యుత్​ కాంతుల ప్రదర్శన అలరించింది. అన్ని దేశాల ఆటగాళ్లు.. తమ జాతీయ జెండాలను ప్రదర్శించారు. జులై 23న ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్​.. ఆగస్టు 8 వరకు జరిగాయి.

Tokyo Olympics 2020 Closing Ceremony
ముగింపు వేడుకలో విన్యాసాలు

పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. చైనా, జపాన్​ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఏడు పతకాలు సాధించిన భారత్​ 48 స్థానంతో ఒలింపిక్స్​కు ఘనంగా వీడ్కోలు పలికింది.

Tokyo Olympics 2020 Closing Ceremony
టోక్యో ఒలింపిక్స్​ ముగింపు వేడుక
Tokyo Olympics 2020 Closing Ceremony
టోక్యో ఒలింపిక్స్​ ముగింపు వేడుక
Tokyo Olympics 2020 Closing Ceremony
టోక్యో ఒలింపిక్స్​ ముగింపు వేడుక

కరోనా నేపథ్యంలో ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్​ను విజయవంతంగా నిర్వహించారు. 1964 తర్వాత రెండోసారి నిర్వహించిన జపాన్​ ఎలాంటి అవాంతరాలు లేకుండా 17 రోజుల పాటు క్రీడలను సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంది. ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం టోక్యో స్టేడియంలో నిర్వహించిన విద్యుత్​ కాంతుల ప్రదర్శన అలరించింది. జపాన్​ క్రౌన్​ ప్రిన్స్ అకిషినో, అంతర్జాతీయ ఒలింపిక్స్ అధ్యక్షుడు థామస్​ బాక్​ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

పతకాల వేటలో..

ఈ క్రీడల్లో భారత్​ ఎప్పడూ లేని విధంగా ఏడు పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు) ముగించింది. అంతకుముందు అత్యధికంగా లండన్​ ఒలింపిక్స్​లో (2012) 6 పతకాలొచ్చాయి. ప్రస్తుత ఒలింపిక్స్​ పతకాల పట్టికలో 113 పతకాలతో(39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు) అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 88 పతకాలతో(38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంస్యాలు) చైనా రెండో స్థానంలో ఉండగా.. ఆతిథ్య దేశం జపాన్ 58 పతకాలతో(27 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలు) మూడో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి.. ఈ ఒలింపిక్స్​లో 'భారత' పతక విజేతలు వీరే..

Last Updated : Aug 8, 2021, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.