టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణంతో దుమ్మురేపిన నీరజ్ చోప్డా.. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచ నెం.1 జొహన్నెస్ వెట్టర్(జర్మనీ)కు నీరజ్‌కు మధ్య ఇప్పుడు కేవలం 81పాయింట్ల దూరం మాత్రమే ఉంది.
పొలాండ్‌కు చెందిన మార్సిన్ క్రుకొవాస్కి మూడు, చెక్ రిపబ్లిక్ జాకుబ్ వద్లెచ్ నాలుగు, జర్మనీ జులియన్ వెబర్ ఐదో స్థానంలో నిలిచారు.
ఫైనల్లో.. 87.58మీటర్లు వేసి భారత్‌కు మరిచిపోలేని స్వర్ణాన్ని ఇచ్చాడు నీరజ్ చోప్డా. ప్రపంచ నెం.1 జొహన్నెస్ వెట్టర్.. మూడుసార్లు విఫలయత్నం చేసి తప్పుకొన్నాడు.
ఇక 2008 తర్వాత భారత్‌కు వ్యక్తిగతంగా పసిడిని అందించి అథ్లెట్‌గా రికార్డులకెక్కిన నీరజ్‌పై భారతీయులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నీరజ్‌కు భారీ నజరానా ప్రకటించగా.. అనేకమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి కానుకలు ఇస్తున్నారు.
ఇదీ చూడండి:- పాకిస్థాన్ అథ్లెట్‌కు నీరజ్ సూచనలు