ETV Bharat / sports

ఒలింపిక్స్ కోసం ఇష్టమైన ఆహారానికి ఆర్నెళ్లు దూరం!

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం నెగ్గిన నీరజ్‌ చోప్డా(neeraj chopra gold medal).. వందేళ్ల భారత క్రీడాభిమానుల కలను సాకారం చేశాడు. ఈ క్రమంలో విశ్వక్రీడల కోసం తనకిష్టమైన కొన్ని వంటకాలను తినడం మానేశానని చెప్పాడు. అవేంటంటే..

neeraj chopra
నీరజ్​ చోప్రా
author img

By

Published : Aug 8, 2021, 12:14 PM IST

అథ్లెటిక్స్‌లో తొలి ఒలింపిక్‌ పతకం కోసం భారతీయుల వందేళ్ల నిరీక్షణకు నీరజ్‌ చోప్డా(neeraj chopra gold medal) తెరదించాడు. విశ్వ క్రీడల్లో జావెలిన్‌ త్రోలో స్వర్ణం నెగ్గి భారతీయుల ముఖాల్లో ఆనందం నింపాడీ 23 ఏళ్ల హరియాణా కుర్రాడు. ఈ నేపథ్యంలోనే, తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి చోప్రా మాట్లాడాడు. పానీ పూరిలు, స్వీట్లు ఆరగించడం చాలా ఇష్టమని పేర్కొన్నాడు.

"పానీపూరి తినడం వల్ల ఎటువంటి హాని లేదని అనుకుంటున్నా. ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది. మన పొట్టలో అధిక భాగం నీటితో నిండి ఉంటుంది. పానీపూరి చూడటానికి పెద్దగా కనిపించినా దానిలో చాలా తక్కువ పిండి ఉంటుంది. ఎక్కువగా తింటున్నామని మీకు అనిపించినప్పటికీ వాటిని ఆరగించడం ద్వారా ఎక్కువ నీరు తీసుకుంటారు. వీటిని రోజూ తినాలని నేను సూచించను. అయితే, అప్పుడప్పుడు పానీపూరి తినడం మంచిదేనని ఒక అథ్లెట్‌గా అనుకుంటున్నా."

-నీరజ్‌ చోప్రా.

చోప్రాకు ఇష్టమైన మరో ఆహారం ఏంటంటే.. ఇంట్లో తయారుచేసిన చుర్మా(పంచదార, నెయ్యితో చేసిన రోటీ). నీరజ్‌.. రాక కోసం ఎదురుచూస్తున్నానని చోప్రా తల్లి సరోజ్‌ అన్నారు. నీరజ్‌ రాగానే అతనికిష్టమైన చుర్మా వంటకం తినిపించాలని ఉందని ఆమె చెప్పారు. స్వీట్లు తినాలని ఉన్నా.. ఈవెంట్స్‌కు ముందు వాటికి దూరంగా ఉండేవాడని సరోజ్‌ పేర్కొన్నారు. ఒలింపిక్స్‌ కోసం ఆరు నెలల ముందు నుంచి వాటిని తినడం మానేశాడని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి: Neeraj Chopra: ఆ మార్పుతోనే నీరజ్​కు స్వర్ణం

ఇదీ చూడండి:- నీరజ్​కు మోదీ ఫోన్​.. ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.