ETV Bharat / sports

Tokyo paralympics: వినోద్​కు చేజారిన కాంస్యం - discus throw paralympics schedule

టోక్యో పారాలింపిక్స్​లో డిస్కక్​ త్రోయర్​ వినోద్​కు(Vinod Kumar Paralympics) చుక్కెదురైంది. అతడు డిసేబిలిటీ క్లాసిఫికేషన్​ రీఎసెస్​మెంట్​లో అర్హత సాధించలేకపోయాడు. దీంతో అతడికి వచ్చిన కాంస్య పతకం చేజారిపోయింది. ఫలితంగా భారత పతకాల సంఖ్య ఆరుకు పరిమితమైంది.

vinod
వినోద్​
author img

By

Published : Aug 30, 2021, 3:27 PM IST

Updated : Aug 30, 2021, 3:36 PM IST

టోక్యో పారాలింపిక్స్​లో డిస్కక్​ త్రోయర్​ వినోద్​కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పోటీల్లో అతడు సాధించిన కాంస్య పతకం చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోయింది. అతడు డిసేబిలిటీ క్లాసిఫికేషన్​ రీఎసెస్​మెంట్​లో అర్హత సాధించలేకపోవడమే ఇందుకు కారణం.

ఆదివారం జరిగిన పోటీల్లో ఎఫ్52 కేటగిరీలో పాల్గొన్న వినోద్(41).. 19.91 మీటర్ల దూరం డిస్కస్‌ త్రో చేసి మూడో స్థానంలో నిలిచాడు. అయితే.. ఎఫ్52 కేటగిరీలో వినోద్​(Vinod Kumar Paralympics) ఎంపికపై అనుమానం వ్యక్తం చేశారు కొందరు పోటీదారులు. వాస్తవానికి.. ఆగస్టు 22నే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తైంది. అయినప్పటికీ పోటీదారులు అతడి ఎంపికపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడు సాధించిన పతకాన్ని హోల్డ్​లో​ ఉంచారు. డిసేబిలిటీ క్లాసిఫికేషన్​ రీఎసెస్​మెంట్ నిర్వహించారు. ఇందులో అతడు అర్హత సాధించలేకపోయాడు.

ఎఫ్​52 కేటగిరీ అంటే..

బలహీనమైన కండరాల శక్తి, పరిమిత స్థాయి కదలిక, అవయవ లోపం లేదా కాళ్ల పొడవులో వ్యత్యాసం, వెన్నముక గాయంతో ఉన్న వారికి ఎఫ్​52 పోటీలో పాల్గొనేందుకు అనుమతిస్తారు.

ఈ ఫలితం వల్ల టోక్యో పారాలింపిక్స్​లో భారత్​కు వచ్చిన ఏడు పతకాలలో ఒకటి చేజారిపోయింది. దీంతో భారత్​ ఖాతాలో ఇప్పుడు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి.

ఇదీ చూడండి: పారాలింపిక్స్​లో భారత్​కు మరో పతకం.. వినోద్​కు కాంస్యం

Last Updated : Aug 30, 2021, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.