ETV Bharat / sports

Tokyo Olympics: ఆస్ట్రేలియా చేతిలో భారత్ హాకీ జట్టు చిత్తు - హాకీ ఇండియా

టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 1-7 తేడాతో మన్​ప్రీత్​ సేన ఓటమి పాలైంది. భారత్​ తన తదుపరి మ్యాచ్​లో స్పెయిన్​తో తలపడనుంది.

tokyo olympics 2020
టోక్యో ఒలింపిక్స్​ 2020
author img

By

Published : Jul 25, 2021, 4:36 PM IST

Updated : Jul 25, 2021, 5:39 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో భారత పురుషుల హకీ జట్టు ఘోర పరాజయం పాలైంది. 1-7 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. హాకీ ప్రపంచ నంబర్​ వన్ టీమ్ అయిన ఆస్ట్రేలియా.. ఆరంభం నుంచే భారత్​పై పైచేయి సాధించింది. ఆట పదో నిమిషంలోనే డానియల్​ బీలే తొలి గోల్​ సాధించాడు. జోషూవ బెల్డ్జ్​(26'), ఆండ్రూ ఫ్లిన్​ ఒగిల్వీ(23'), జెరెమీ హేవార్డ్​(21'), బ్లాక్​ గోవర్స్​(40', 42'), టిమ్ బ్రాండ్(51') గోల్స్​తో భారత్​పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఆస్ట్రేలియా. ఫలితంగా ఒలింపిక్స్​లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

దిల్​ప్రీత్​ సింగ్​ 34వ నిమిషంలో గోల్​ కొట్టడం వల్ల భారత్​కు ఆ ఒక్క గోల్​ అయినా దక్కింది.

ప్రారంభ మ్యాచ్​లో న్యూజిలాండ్​పై 3-2తో విజయం సాధించిన మన్​ప్రీత్​ సేన​ ఈ మ్యాచ్​లో భంగపాటుకు గురైంది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్​లో​ స్పెయిన్​తో తలపడనుంది టీమ్ఇండియా.

ఇదీ చదవండి: రెజ్లింగ్​లో ప్రియా మాలిక్​కు స్వర్ణం

Last Updated : Jul 25, 2021, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.