ETV Bharat / sports

Olympics Live: క్వార్టర్స్​లో సింధు- ఒలింపిక్స్​ నుంచి మేరీకోమ్​ ఔట్​ - deepika kumari

olympics, sindhu, hockey
ఒలింపిక్స్​, సింధు, హాకీ
author img

By

Published : Jul 29, 2021, 6:35 AM IST

Updated : Jul 29, 2021, 7:54 PM IST

19:50 July 29

స్విమ్మింగ్​లోనూ..

స్విమ్మింగ్​లోను భారత్​కు నిరాశ తప్పలేదు. పురుషుల 100మీటర్ల బటర్​ఫ్లై హీట్​ 2లో సాజన్​ ప్రకాశ్​ ఓటమిపాలయ్యాడు.

16:09 July 29

బాక్సింగ్​లో నిరాశ.. ప్రీక్వార్టర్స్​లో మేరీకోమ్​ ఓటమి

టోక్యో ఒలింపిక్స్​లో అనూహ్య పరిణామం! భారత దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్​ ప్రీకార్టర్స్​లో ఓటమిపాలైంది. మహిళల 51 కేజీల విభాగంలో కొలంబియా బాక్సర్​ వాలెన్సియాతో జరిగిన పోరులో ఓడిపోయింది. ఫలితంగా ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించింది.

ఈసారి ఒలింపిక్స్​ పతకంపై భారత్​ ఆశలు పెట్టుకున్న అథ్లెట్లలో మెరీకోమ్​ పేరు ముందు వరుసలో ఉంది. గత మ్యాచ్​లో విజయం సాధించి జోరు మీద కనిపించిన మేరీకోమ్​.. ఈ మ్యాచ్​లోనూ గెలుస్తుందని క్రీడాభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ అభిమానులను నిరాశపరుస్తూ క్వార్టర్స్​కు కూడా ఆర్హత సాధించలేకపోయింది.

09:00 July 29

బాక్సింగ్​లో మరో విజయం..

ఒలింపిక్స్​లో బాక్సింగ్​లో భారత ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే  తమ తమ విభాగాల్లో మేరీకోమ్ ప్రీక్వార్టర్స్​​, పూజారాణి క్వార్టర్స్​లోకి ప్రవేశించగా.. ఇప్పుడు పురుషుల సూపర్​ హెవీ (91 కేజీలు+) విభాగంలో సతీశ్​ కుమార్​ నాకౌట్​ చేరాడు. జమైకాకు చెందిన రికర్డో బ్రౌన్​ను 4-1 తేాడాతో ఓడించాడు సతీశ్​. 

ఆగస్టు 1న జరిగే క్వార్టర్​ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్​ బాక్సర్​.. జలలోవ్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.  

08:32 July 29

ప్రీక్వార్టర్స్​లో అతాను దాస్​..

భారత ఆర్చర్​ అతాను దాస్​.. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్స్​కు దూసుకెళ్లాడు. 1/32 ఎలిమినేషన్స్​లో చైనీస్​ తైపీకి చెందిన డెంగ్​ యు- చెంగ్​ను 6-4 తేడాతో ఓడించిన అతాను.. తర్వాతి మ్యాచ్​లో దక్షిణ కొరియా టాప్​ ప్లేయర్​ ఓ జిన్​ హయక్​పై షూట్​-ఆఫ్​లో నెగ్గి ప్రీక్వార్టర్స్​లోకి ప్రవేశించాడు. 

ఓ జిన్​.. రెండు సార్లు ఒలింపిక్ ఛాంపియన్​ కావడం విశేషం.

ఈ మ్యాచ్​ ఆద్యతం హోరాహోరీగా సాగింది. తొలి సెట్​ ఓ జిన్​ నెగ్గి 2 పాయింట్లు సాధించాడు. తర్వాతి రెండు సెట్లు టై అవ్వగా.. జిన్​ 4, అతాను 2 పాయింట్లతో నిలిచారు. తర్వాతి సెట్​ అతాను నెగ్గగా 4-4తో స్కోరు సమమైంది. మళ్లీ ఐదో సెట్​ టై అయింది. 5-5తో నిలిచారు. షూట్​-ఆఫ్​లో ఓ జిన్​ 9 స్కోరు చేయగా.. అతాను బాణం గురి తప్పలేదు. 10 పాయింట్లు సాధించి.. మ్యాచ్​ గెలిచాడు. 

07:51 July 29

అతాన్​ దాస్​ విజయం..

ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ విజయం సాధించాడు. 1/32 ఎలిమినేషన్స్​లో చైనీస్​ తైపీ ఆర్చర్​ డెంగ్​ యు చెంగ్​పై 6-4 తేడాతో గెలిచాడు. తర్వాతి మ్యాచ్​లో కొరియా ఆర్చర్​తో పోటీ పడనున్నాడు. 

07:51 July 29

హాకీలో జోరు..

ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత జట్టు మరో విజయం సాధించింది. డిఫెండింగ్​ ఛాంపియన్​ అర్జెంటీనాను 3-1 తేడాతో చిత్తు చేసింది. నాలుగో క్వార్టర్స్​లో 2 గోల్స్​తో అదరగొట్టింది భారత్​. పూల్​ ఏలో  ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో మూడు గెలిచింది టీమ్​ ఇండియా. ఆఖరి మ్యాచ్​లో జపాన్​తో తలపడనుంది. 

06:50 July 29

క్వార్టర్స్​లోకి సింధు..

భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు.. క్వార్టర్స్​లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్​ ప్రిక్వార్టర్స్​లో డెన్మార్క్​ షట్లర్​ మియా బ్లిక్​ఫెల్ట్​ను వరుస సెట్లలో ఓడించింది. 

21-15, 21-13 తేడాతో ఓడించింది. మ్యాచ్​ మొత్తం దూకుడైన ఆట ప్రదర్శించింది తెలుగు తేజం. 

క్వార్టర్​ ఫైనల్లో గెలిస్తే కనీసం కాంస్యం సాధించే అవకాశముంది. 

06:34 July 29

హాకీ..

ఒలింపిక్స్​లో దూకుడు ప్రదర్శిస్తున్న భారత హాకీ టీం.. డిఫెండింగ్​ ఛాంపియన్​ అర్జెంటీనాతో నిలకడగా ఆడుతోంది. తొలి క్వార్టర్ ముగిసేసరికి 0-0తో ఉన్నాయి ఇరుజట్లు. 

06:31 July 29

షూటింగ్​లో..

షూటింగ్​ మహిళల 25. మీ. పిస్టల్​ విభాగంలో రహి సర్నోబత్​.. క్వాలిపికేషన్​ ప్రెసిషన్​ స్టేజీలో 10 మందిలో ఏడో స్థానంలో నిలిచింది. మరో స్టార్​ షూటర్​ మను బాకర్​ ఇంకా పోటీ పడాల్సి ఉంది. 

06:30 July 29

సింధు దూకుడు..

బ్యాడ్మింటన్​ ప్రిక్వార్టర్స్​లో 12వ ర్యాంకర్​ మియా బ్లిక్​ఫెల్ట్​తో ​(డెన్మార్క్​) తలపడుతోంది పీవీ సింధు. 

06:09 July 29

Olympics Live: రోయింగ్​లో మెరుగైన ప్రదర్శన- సింధు దూకుడు

రోయింగ్​ లైట్​ వెయిట్​ డబుల్స్​ స్కల్స్​లో భారత జోడీ (అర్జున్​- అర్వింద్​) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఫైనల్​ బిలో.. ఐదో స్థానంలో నిలిచారు. మొత్తంగా... 11వ స్థానంతో టోర్నీని ముగించారు. ఒలింపిక్స్​ రోయింగ్​లో భారత్​కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 

Last Updated : Jul 29, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.