ETV Bharat / sports

Olympics Live: షూటింగ్​, టీటీలో నిరాశ- బాక్సింగ్​లో లవ్లీనా క్వార్టర్స్​కు..

Tokyo Olympics
ఒలింపిక్స్​
author img

By

Published : Jul 27, 2021, 6:20 AM IST

Updated : Jul 27, 2021, 11:22 AM IST

11:18 July 27

బాక్సింగ్​లో లవ్లీనా శుభారంభం..

షూటింగ్​, బ్యాడ్మింటన్​, టీటీల్లో ఇవాళ టీమ్​ఇండియా ఓడినప్పటికీ.. చివరకు ఓ విజయం అందించింది బాక్సర్​. మహిళల 69 కేజీల వెల్టర్​ వెయిట్​ విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్​.. జర్మనీ క్రీడాకారిణిపై 3-2 తేడాతో గెలిచింది. తద్వారా క్వార్టర్​ పైనల్లో అడుగుపెట్టింది. 

ఇప్పటికే 51 కేజీల విభాగంలో మేరీ కోమ్​.. క్వార్టర్స్​లో అడుగుపెట్టింది. వీరు పతకంపై ఆశలు రేపుతున్నారు.  

10:42 July 27

బ్యాడ్మింటన్​లో గెలిచినా..

బ్యాడ్మింటన్​ పురుషుల డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజ్​- చిరాగ్​ షెట్టి ద్వయం.. తమ మూడో మ్యాచ్​లో గ్రేట్​ బ్రిటన్​పై 21-17,21-19 తేడాతో గెలిచింది. వరుస సెట్లలో ఓడించింది. అయినా.. క్వార్టర్​ ఫైనల్​కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్​ ఏలో  భారత్​ కంటే మెరుగైన స్థానాల్లో ఇండోనేసియా, చైనీస్​ తైపీ నాకౌట్​కు చేరుకున్నాయి. 

10:39 July 27

షూటింగ్​ ఎయిర్​ రైఫిల్​లోనూ..

ఒలింపిక్స్​ భారత షూటర్ల వైఫల్యం కొనసాగుతోంది. షూటింగ్​ 10. మీ ఎయిర్​ రైఫిల్​ మిక్స్​డ్​ విభాగంలో భారత జోడీలు ఫైనల్​కు అర్హత సాధించలేకపోయాయి. వలరివన్​- దివ్యాన్ష్​ జంట 12, అంజుమ్​- దీపక్ 18 స్థానాల్లో నిలిచాయి. 

అంతకుముందు 10. మీ. ఎయిర్​ పిస్టల్​ విభాగంలోనూ భారత్​ జోడీలు నిరాశపరిచాయి. ​ 

09:51 July 27

బ్యాడ్మింటన్​లో..

బ్యాడ్మింటన్​ పురుషుల డబుల్స్​లోనూ భారత్​ పోరాటం దాదాపు ముగిసినట్లే. ఓ మ్యాచ్​ గెలిచి, మరో మ్యాచ్​ ఓడిన సాత్విక్​ సాయిరాజ్​- చిరాగ్​ షెట్టి జోడీ.. మూడో మ్యాచ్​లో గెలిచినా క్వార్టర్స్​కు చేరేది కష్టమే. పాయింట్ల పట్టికలో ఇండోనేసియా, చైనీస్​ తైపీ భారత్​ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. 

09:49 July 27

టీటీలో ముగిసిన పోరాటం..

ఒలింపిక్స్​.. టేబుల్​ టెన్నిస్​లో భారత పోరాటం ముగిసింది. ఇప్పటికే మిక్స్​డ్​ డబుల్స్​, మహిళల సింగిల్స్​ ఈవెంట్లో భారత ప్యాడ్లర్లు ఓడగా.. ఇప్పుడు పురుషుల సింగిల్స్​ రౌండ్​-3లో శరత్​ కమల్​ కథ ముగిసింది. 

4-1(11-7, 8-11, 13011, 11-4, 11-4) తేడాతో డిఫెండింగ్​ ఛాంపియన్​ మా లాంగ్​ చేతిలో పరాజయం చెందాడు.

08:05 July 27

హాకీలో విజయం..

హాకీలో టీమ్​ఇండియా మళ్లీ విజృంభించింది. ఆడిన మూడో మ్యాచ్​లో స్పెయిన్​పై 3-0 తేడాతో గెలిచింది. 3 మ్యాచ్​ల్లో ఇప్పటివరకు భారత్​ 2 గెలిచింది. 

06:42 July 27

నిష్క్రమణ...

షూటింగ్​లో క్వాలిఫికేషన్​-2కు అర్హత సాధించిన సౌరభ్​- మను బాకర్​ జోడీ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. అక్కడ.. 8 మందిలో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన ఈ జోడీ.. 400 పాయింట్లకు గానూ 380కే పరిమితమైంది. సౌరభ్​ చౌదరీ 194 స్కోరు చేయగా.. తడబడిన మనుబాకర్​ 186 మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్​కు పతకావకాశాలు చేజారాయి. 

06:05 July 27

Olympics Live: షూటింగ్​లో మను- సౌరభ్​ టీం దూకుడు

ఒలింపిక్స్​లో 10. మీ ఎయిర్​ పిస్టల్​ మిక్స్​డ్​ టీం విభాగంలో భారత జోడీ అదరగొట్టింది. క్వాలిఫికేషన్​ స్టేజీ 1లో 582 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫికేషన్​-2కు అర్హత సాధించింది. 

ఇంకో జోడీ యశస్విని- అభిషేక్​ వర్మ నిరాశపరిచారు. 17వ స్థానంతో సరిపెట్టుకుందీ జంట.

Last Updated : Jul 27, 2021, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.