రష్యాకు చెందిన ఇద్దరు టెన్నిస్ ప్లేయర్లపై జీవితకాల నిషేధం విధిస్తూ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ(ఐటీఐఏ) నిర్ణయం తీసుకుంది. మహిళల డబుల్స్‌లో భాగస్వాములుగా కొనసాగిన పలు మ్యాచ్‌ల్లో... వీళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తేలిందని ఐటీఐఏ పేర్కొంది.
"మెర్దివా, సోఫియా డిమిత్రివాలు మ్యాచ్ ఫిక్సింగ్ నేరానికి పాల్పడ్డట్లు రుజువైంది. దర్యాప్తునకు సైతం వారివురూ సహకరించట్లేదు. విభిన్న సంఘటనల అనంతరం వారిపై దృష్టి సారించాం. వారిద్దరు కలిసి ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ జరిగింది," అని ఐటీఐఏ వెల్లడించింది. అయితే ఏ టోర్నమెంటులో వీరు ఫిక్సింగ్ చేశారనేది మాత్రం ఐటీఐఏ వివరించలేదు.
ఈ ఇద్దరు టెన్నిస్ ప్లేయర్లూ.. ఆఫ్రికా, టర్కీ, తూర్పు యూరోప్‌లలో జరిగే చిన్న స్థాయి ప్రో టోర్నమెంట్లలో ఎక్కువగా పాల్గొన్నారు. అతి తక్కువ విజయాలను నమోదు చేశారు. మెర్దివా ప్రపంచ ర్యాంక్ 928 కాగా.. డిమిత్రివా 1,191వ స్థానంలో ఉంది.
2019లో కెన్యాలో జరిగిన ఓ టోర్నీలో వీరిద్దరూ జతకట్టినట్లు ప్రపంచ టెన్నిస్ సమాఖ్య రికార్డులు పేర్కొంటున్నాయి.
ఇదీ చదవండి: కోహ్లీ నంబర్ వన్- 2, 3లో రోహిత్, బుమ్రా