జపాన్ టెన్నిస్ స్టార్, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత నయోమీ ఒసాకా.. సామాజిక మాధ్యమాల్లో ఘాటుగా స్పందించింది. తను స్విమ్‌సూట్‌తో పోస్టు పెట్టగా.. కాస్త పద్ధతిగా ఉండాలంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. వారికి తనదైన రీతిలో జవాబిచ్చింది.
-
Should I post version 2? pic.twitter.com/HXBUb4iutD
— NaomiOsaka大坂なおみ (@naomiosaka) July 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Should I post version 2? pic.twitter.com/HXBUb4iutD
— NaomiOsaka大坂なおみ (@naomiosaka) July 9, 2020Should I post version 2? pic.twitter.com/HXBUb4iutD
— NaomiOsaka大坂なおみ (@naomiosaka) July 9, 2020
"నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎంతోమంది నన్ను అమాయకంగానే కనిపించాలని చెప్తున్నారు. మీరు చేయలేని వాటిని ఇతరులపై రుద్దొద్దు. నాకు 22 ఏళ్లని మీకు తెలియదా.? పూల్‌లో స్విమ్‌సూట్ వేసుకుంటా. నేను ఏం ధరించాలో కామెంట్ చేయాలని మీరెందుకు అనుకుంటున్నారు?" అని ఒసాకా ప్రశ్నించింది.
యూఎస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన ఈ భామ.. ఇటీవలె కాలంలో స్విమ్‌సూట్ సహా తన మోడలింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అవి బాగా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇన్‌స్టాలో మిలియన్ ఫాలోవర్లతో దూసుకెళ్తోంది ఒసాకా. ప్రపంచ టాప్-10 ర్యాంక్‌లో ఉన్న ఈ భామ... ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటికే పరిమితమైంది.