ETV Bharat / sports

'ఆస్ట్రేలియన్ ఓపెన్​ నిర్వహణకు మేం రెడీ' - మెల్​బోర్న్

వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వహణకు టెన్నిస్ ఆస్ట్రేలియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సురక్షితమైన వాతావరణంలో క్రీడలు జరిపేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించింది.

Tennis Australia planning to host Australian Open in Melbourne
ఆస్ట్రేలియన్ ఓపెన్​
author img

By

Published : May 17, 2021, 9:51 PM IST

వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్​ కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది టెన్నిస్ ఆస్ట్రేలియా యోచిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

"ఓ వైపు కొవిడ్ విజృంభిస్తున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఈ ఏడాది విజయవంతంగా నిర్వహించాం. 2022 టోర్నీని జనవరిలో నిర్వహించాలని నిర్ణయించాం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లకు ఆతిథ్యమిచ్చేందుకు మెల్​బోర్న్​ సిద్ధంగా ఉంది. సురక్షితమైన వాతావరణంలో ఆటలు నిర్వహించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నాం" అని టెన్నిస్ ఆస్ట్రేలియా పేర్కొంది.

టోర్నీ నిర్వహణకు విక్టోరియా, ఫెడరల్​ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని టోర్నీ డైరెక్టర్​ క్రైగ్​ టిలే తెలిపారు. తగిన విధంగా క్వారంటైన్​ తదితర ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'బాల్ టాంపరింగ్' వివాదంపై విచారణ హాస్యాస్పదం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.