స్వానిష్ టెన్నిస్ ఆటగాడు ఎన్రిక్ లోపెజ్ నిషేధానికి గురయ్యాడు. 2017లో జరిగిన టోర్నీల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు అతడిని 8 ఏళ్లు ఆటకు దూరం చేసింది టెన్నిస్ బోర్డు.
లోపెజ్కు 25,000 డాలర్లు జరిమానా విధించింది టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్. ఇప్పటినుంచి అధికారిక మ్యాచ్‌లో తాను ఆడకూడదని పేర్కొంది. ప్రస్తుతానికి మూడు మ్యాచ్ ఫిక్సింగ్ కేసులపై స్పష్టత వచ్చిందని, మరో రెండింటి సంగతి ఇంకా తేలాల్సి ఉందని తెలిపింది.
లోపెజ్(29) మెన్ సింగిల్స్‌లో 2018లో నంబర్ 154 ర్యాంకును సాధించాడు. ఇదే అతడి అత్యుత్తమ ర్యాంకు.
ఇదీ చదవండి:'ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహణకు సై'