ETV Bharat / sports

విలియమ్స్​ సిస్టర్స్​ వార్​.. సెరెనా జయకేతనం - అక్క వీనస్​పై సెరెనా గెలుపు

లాక్​డౌన్ తర్వాత పాల్గొన్న తన తొలి టెన్నిస్ టోర్నీలో స్టార్ ప్లేయర్​ సెరెనా విలియమ్స్​ ముందడగు వేసింది. సోదరి వీనస్​పై నెగ్గి క్వార్టర్స్​లోకి ప్రవేశించింది.

Serena beats Venus
అక్క వీనస్​పై సెరెనా గెలుపు
author img

By

Published : Aug 14, 2020, 1:40 PM IST

కరోనా లాక్​డౌన్ తర్వాత జరిగిన టాప్ సీడ్​ టోర్నీలో అమెరికన్ టెన్నిస్ స్టార్‌ సెరెనా విలియమ్స్ అదరగొట్టింది. అక్క వీనస్ విలియమ్స్‌కు షాకిచ్చి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రెండో రౌండ్​లో 3-6, 6-3, 6-4తో ఆమెను మట్టికరిపించింది. వీరిద్దరి మధ్య జరిగిన పోటీలో చివరి సెట్​లో వరుసగా నాలుగు గేమ్స్ గెలవడం సెరెనాకు ఇదే తొలిసారి. సెరెనాకు వీనస్‌పై ఇది 19వ విజయం.. వీసస్​ మాత్రం ఇప్పటివరకు సోదరిపై 12 సార్లు మాత్రమే గెలిచింది.

Serena
సెరెనా

తొలి రౌండ్లో సెరెనా 4-6, 6-4, 6-1తో బెర్నాండా పెరా (అమెరికా)పై విజయం సాధించింది. క్వార్టర్స్​లో లేలా ఫెర్నాండెజ్ లేదా షెల్బీ రోజర్స్‌తో తలపడనుంది. సెరెనా ఇప్పటివరకు 23 గ్రాండ్​ టైటిల్స్​ గెలుచుకోగా.. వీనస్​కు ఏడు మాత్రమే వరించాయి.

2017లో అమ్మాయికి జన్మనిచ్చిన విలియమ్స్‌.. పునరాగమనంలో (2018) వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్లో ఫైనల్‌ చేరినా టైటిల్‌ గెలవలేకపోయింది. ఈసారి యుఎస్‌ ఓపెన్‌ నెగ్గి మార్గరేట్‌ కోర్ట్‌ (24) అత్యధిక టైటిళ్ల రికార్డును సమం చేయాలనేది ఈ అమెరికా తార లక్ష్యం.

Serena beats Venus
సెరెనా

ఇది చూడండి ఆరు నెలల తర్వాత కోర్టులోకి సెరెనా విలియమ్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.