ETV Bharat / sports

French Open: గాయంతో ఫెదరర్​ ఔట్​!

author img

By

Published : Jun 6, 2021, 10:30 AM IST

దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్​ ఫెదరర్​ ఫ్రెంచ్​ ఓపెన్ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. మరో సారి మోకాలి గాయం తిరగబెట్టడం వల్ల టోర్నీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత టోర్నీలో నాలుగో రౌండ్​కు అర్హత సాధించాడు ఫెదరర్.

roger federer, swiss tennis player
రోజర్ ఫెదరర్, స్విస్ టెన్నిస్ క్రీడాకారుడు

స్విస్​ టెన్నిస్ దిగ్గజం రోజర్​ ఫెదరర్​(Roger Federer) ఫ్రెంచ్ ఓపెన్​(French open) నుంచి వైదొలగనున్నాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న రోజర్​.. ప్రస్తుత టోర్నీలో నాలుగో రౌండ్​కు చేరుకున్నాడు.

"ఫ్రెంచ్​ ఓపెన్​లో ఆటను కొనసాగించే విషయమై నేను నిర్ణయం తీసుకోవాలి. గాయం ప్రమాదకరమా? కాదా? అనేది ఆలోచించాలి. ప్రతి మ్యాచ్ అనంతరం నా మోకాలు ఎలా ఉందో చూస్తున్నాను. నేను ఆడతానో లేదో తెలీదు."

-రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడాకారుడు.

మూడో రౌండ్​లో లిథువేనియా ఆటగాడు రికార్డాస్ బెర్కిన్స్​పై విజయం సాధించి నాలుగో రౌండ్​కు అర్హత సాధించాడు ఫెదరర్​. తదుపరి ఇటలీ ప్లేయర్​ మాటియో బెరెట్టినితో తలపడునున్నాడు. ఇప్పటికే 20 గ్రాండ్​ స్లామ్​లు గెలుపొందిన రోజర్​.. 2020లో రెండు మోకాళ్లకు శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.

ఇదీ చదవండి: French Open: ఓటమితో స్వితోలినా ఇంటిముఖం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.