ETV Bharat / sports

ఇటాలియన్​ ఓపెన్​ ఫైనల్లోకి రఫా

స్టార్ టెన్నిస్ ప్లేయర్​ రఫెల్ నాదల్.. ఇటాలియన్​ ఓపెన్​ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీస్​లో అమెరికా ఆటగాడు ఒపెల్కాను 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు.

rafel nadal, star tennis player
రఫెల్ నాదల్, టెన్నిస్ ఆటగాడు
author img

By

Published : May 16, 2021, 6:33 AM IST

ఫేవరెట్‌ రఫెల్‌ నాదల్‌ ఇటాలియన్‌ ఓపెన్​లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ నాదల్‌ 6-4, 6-4తో ఒపెల్కా (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించాడు. ఈ పోరులో అయిదు ఏస్‌లు కొట్టిన ఈ స్పెయిన్‌ స్టార్‌... రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. ఈ టోర్నీలో రఫా ఇప్పటికే తొమ్మిదిసార్లు విజేతగా నిలిచాడు.

మరోవైపు టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. వర్షం కారణంగా రెండు రోజులకు పైగా సాగిన క్వార్టర్స్‌ సమరంలో జకో 4-6, 7-5, 7-5తో స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో స్వైటెక్‌ (పోలెండ్‌), ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) ఫైనల్లో ప్రవేశించారు. సెమీస్‌లో స్వైటెక్‌ 7-6 (7/3), 6-3తో కొకోగాఫ్‌ (అమెరికా)ను ఓడించగా.. ప్లిస్కోవా 6-1, 3-6, 6-2తో పెట్రా మార్టిచ్‌ (క్రొయేషియా)పై కష్టపడి గెలిచింది.

ఇదీ చదవండి: ఐపీఎల్​ స్థాయి వేరు: పాక్​ పేసర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.