అత్యధిక వారాలు ఏటీపీ ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న ఆటగాడిగా ఫెదరర్ రికార్డును నొవాక్ జకోవిచ్ సమం చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ఈ సెర్బియా టెన్నిస్ స్టార్.. మొత్తం 310 వారాల పాటు నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు.
జకోవిచ్ వచ్చే వారం ఫెదరర్ రికార్డు (310)ను బద్దలు కొడతాడు. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన నొవాక్.. 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అతడు తొలిసారి 2011లో ప్రపంచ నంబవర్వన్ ర్యాంకు సాధించాడు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ దూరం!