ETV Bharat / sports

8 వేళ్లతో టెన్నిస్​ ఆడేస్తోంది

టెన్నిస్​.. ఈ ఆట ఆడాలంటే ఆటగాళ్లు కోర్టులో పాదరసంలా కదలాలి. ప్రత్యర్థిని ఊపిరిసలపకుండా షాట్లు కొట్టాలి. ఇందుకు క్రీడాకారుల కాళ్లు, చేతులు చక్కగా సహకరించాలి. కానీ చేతులు, కాళ్ల ఎదుగుదల లోపంతో పుట్టిన ఫ్రాన్సెస్కా జోన్స్​.. ఆ సమస్యను అధిగమించి ఇప్పుడు ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో బరిలోకి దిగబోతుంది.

author img

By

Published : Feb 7, 2021, 8:51 AM IST

Jones, who was born with a deformity of the legs and arms, is entering the Australian Open
8 వేళ్లతో టెన్నిస్​ ఆడేస్తోంది

టెన్నిస్‌ ఆడాలంటే రాకెట్‌ను గట్టిగా పట్టుకునేందుకు చేతి వేళ్ల బలం కావాలి. రెండు చేతులు ఉపయోగిస్తూ ప్లేయర్లు బలంగా షాట్లు కొట్టడం చూస్తూనే ఉంటాం. కోర్టులో వేగంగా కదలాలంటే పాదాలు సరిగ్గా ఉండాలి. కానీ రెండు చేతులకు కలిపి ఎనిమిది వేళ్లతో, రెండు పాదాలకు కలిపి ఏడు వేళ్లతో ఉన్న ఓ అమ్మాయి టెన్నిస్‌ ఆడగలదనుకుంటామా? ఆ అసాధ్యాన్ని అందుకుంది బ్రిటన్‌కు చెందిన ఫ్రాన్సెస్కా జోన్స్‌. బలహీనతలను దాటి ఈ అమ్మాయి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలో నిలిచింది.

జోన్స్‌ ఒక్కో చేతికి ఓ బొటనవేలితో పాటు మరో మూడు వేళ్లు మాత్రమే ఉంటాయి. ఎడమ కాలికి నాలుగు వేళ్లుంటే.. కుడి కాలికి మూడు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 245 స్థానంలో ఉన్నప్పటికీ.. అర్హత టోర్నీలో పాల్గొనే అవకాశం అదృష్టం రూపంలో ఆమెను వరించింది. ఆ క్వాలిఫయర్స్‌లో తనకంటే మెరుగైన క్రీడాకారిణులను ఓడించిన జోన్స్‌.. ప్రధాన డ్రా మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది. తొలి రౌండ్లో ఆమె.. ప్రపంచ 60వ ర్యాంకు క్రీడాకారిణి షెల్బీ రోజర్స్‌ (అమెరికా)తో తలపడనుంది.

ఆటంకాలను అధిగమిస్తూ..

ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శన ఎలా ఉంటుందో కానీ.. ఆమె ఇక్కడి వరకూ సాగించిన ప్రయాణం మాత్రం గుర్తుండిపోయేదే. చేతులు, పాదాల ఎదుగుదల సరిగా లేని లోపంతో పుట్టిన జోన్స్‌.. టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఆ ఆటను ఆడలేవని వైద్యులు నిరుత్సాహ పరిచినా.. తన ప్రయత్నాన్ని ఆపలేదు. తన చేతులతో పట్టుకోవడానికి అనువుగా ఉండే ప్రత్యేక రాకెట్‌తో సాధన మొదలెట్టింది. కానీ పాదాలు బలంగా లేకపోవడంతో కోర్టులో వేగంగా కదల్లేకపోయేది. కానీ ఆ బలహీనత ఆటపై ప్రభావం చూపకుండా తిరుగులేని విధంగా ఫోర్‌హ్యాండ్‌ షాట్‌ ఆడడంలో ప్రావీణ్యం సంపాదించింది.

తన అనారోగ్య సమస్య కారణంగా ఇప్పటివరకూ 10 సార్లు శస్త్రచికిత్స చేయించుకున్న జోన్స్‌.. ఆ కారణంతో తరచూ ఆట నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చేది. రెండేళ్లుగా తన ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించి ఇప్పుడు ఫలితాలు రాబడుతోంది. 352వ ర్యాంకుతో 2020ని ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం 245వ ర్యాంకుకు చేరుకుంది.

ఇదీ చదవండి: రేపటి నుంచే ఆస్ట్రేలియన్​ ఓపెన్​.. ఫేవరెట్​ జకోవిచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.