ETV Bharat / sports

French Open: తొలి రౌండ్​లో ఒసాకా శుభారంభం - పాట్రిసియా మారియా టిగ్

జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా(Naomi Osaka) ఫ్రెంచ్ ఓపెన్(French Open)​ రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్​లో రొమేనియా ప్లేయర్​ పాట్రిసియా మారియా టిగ్​పై 6-4, 7-6(4)తో గెలుపొందింది.

naomi osaka, japan tennis player
నవోమి ఒసాకా, జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి
author img

By

Published : May 30, 2021, 6:44 PM IST

ఫ్రెంచ్​ ఓపెన్(French Open)​ తొలి రౌండ్​లో శుభారంభం చేసింది జపాన్​ టెన్నిస్​ క్రీడాకారిణి నవోమి ఒసాకా(Naomi Osaka). రొమేనియా ప్లేయర్​ పాట్రిసియా మారియా టిగ్​పై 6-4, 7-6(4) తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రాండ్​స్లామ్​ మ్యాచ్​ల్లో వరుసగా 15వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

గత రెండు గ్రాండ్​స్లామ్​లను గెలుపొందిన ఒసాకా(Naomi Osaka).. మొత్తంగా 5 మెగా ట్రోఫీలను కైవసం చేసుకుంది. ఫ్రెంచ్​ ఓపెన్​ను(French Open) మాత్రం ఇంత వరకు గెలుపొందలేదు. ఈ సారైనా ఆ అప్రతిష్ఠను తొలగించుకోవాలని ఈ జపాన్ స్టార్​ ప్లేయర్ భావిస్తోంది.

ఇదీ చదవండి: 'హీరోలా చేయకు'- సైనిపై ట్రోల్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.